PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-vijayamma40a12708-ae65-4471-81b8-f01b47eb07f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysr-vijayamma40a12708-ae65-4471-81b8-f01b47eb07f4-415x250-IndiaHerald.jpgవివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియదా? సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉంటుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామంటూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారుysr vijayamma;pawan;cbn;dr rajasekhar;nithya new;pawan kalyan;jagan;y. s. rajasekhara reddy;media;panchayati;y s vivekananda reddy;cbi;murder;minister;letter;murder.;central government;vemuri radhakrishna;reddy;andhra jyothiవైఎస్సార్ ది హత్యేమోనని అనుమానం! విజయమ్మ సంచలనంవైఎస్సార్ ది హత్యేమోనని అనుమానం! విజయమ్మ సంచలనంysr vijayamma;pawan;cbn;dr rajasekhar;nithya new;pawan kalyan;jagan;y. s. rajasekhara reddy;media;panchayati;y s vivekananda reddy;cbi;murder;minister;letter;murder.;central government;vemuri radhakrishna;reddy;andhra jyothiTue, 06 Apr 2021 10:38:29 GMTవైఎస్‌ వివేకానంద రెడ్డి మృతి కేసులో  కొన్ని రోజులుగా  వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియదా? సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉంటుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామంటూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు చూస్తే.. ఆయన చేసేది జర్నలిజమేనా అనిపిస్తోందంటూ  వైఎస్‌ విజయమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజాలను పక్కదారి పట్టించేలా, కుటుంబంలో చిచ్చు పెట్టేలా ఆయన కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు రాతలతో కుటుంబ సభ్యుల్లో ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు బలాన్ని పెంచలేమని తెలిసినప్పుడల్లా ఇలా తమకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ  రాధాకృష్ణ తీరును ఎండగట్టారు విజయమ్మ. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను గుర్తించి చట్టప్రకారం శిక్షించాల్సిందేనన్న విజయమ్మ, ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విజయమ్మ అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా పచ్చ మీడియా నిత్యం అసత్యాలతో వార్తలు వండి వారుస్తోందన్నారు.  పవన్‌ కల్యాణ్‌ కూడా పచ్చమీడియా దారిలోనే తమ కుటుంబాని టార్గెట్‌ చేశారని విజయమ్మ ఆరోపించారు.  పంచాయతీ, మున్సిపల్స్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు.  దీంతో తాము ఇక గెలవలేమని స్పష్టత వచ్చాక చంద్రబాబు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించారని విజయమ్మ విమర్శించారు.  ఇక అప్పటి నుంచి తమ కుటుంబమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దిగజారుడు రాతలు రాస్తున్నారని విజయమ్మ అన్నారు.



పాపం శశికళ... ఓటు వేయలేకపోయారే...!

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?

మెగాస్టార్ కోసం బెంగాల్ ను కేరళగా మార్చారా...?

వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>