Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-lo-eppati-varaku-tvllo-prasaram-kani-cinemalu-eveacd116eb-4939-4fb7-89aa-7b540fd046a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-lo-eppati-varaku-tvllo-prasaram-kani-cinemalu-eveacd116eb-4939-4fb7-89aa-7b540fd046a4-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత నెల రోజులు కూడా గడవక ముందే శాటిలైట్ ఛానెల్స్‌లో (టీవీ)లో వచ్చేస్తున్నాయి. మరికొన్ని రెండు నెలలకు వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా 100 రోజులు కూడా పూర్తవ్వక ముందే టీవీల్లో ప్రసారమవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన చాలా ఏళ్ల వరకు టీవీల్లో ప్రపారం కాలేదు. రీసెంట్‌గా నాని నటించిన ‘జెండాపై కపిరాజు’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలు విడుదలైన మూడు నాలుగేళ్ల తర్వాత టీవీల్లో ప్రసారమైంది. కానీ బాలకృష్ణ నటించిన ‘పరమవీర చక్ర’, ‘అధినాయకుడు’ సినిమాలు ఇtollywood movies;koti;chiranjeevi;nani;balakrishna;soundarya;tollywood;cinema;telugu;amazon;television;tamil;kannada;hindi;hero;nartanasala;ee rojullo;chitramటాలీవుడ్ లో ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాని సినిమాలు ఇవే....?టాలీవుడ్ లో ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాని సినిమాలు ఇవే....?tollywood movies;koti;chiranjeevi;nani;balakrishna;soundarya;tollywood;cinema;telugu;amazon;television;tamil;kannada;hindi;hero;nartanasala;ee rojullo;chitramTue, 06 Apr 2021 03:00:00 GMTఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత నెల రోజులు కూడా గడవక ముందే  శాటిలైట్ ఛానెల్స్‌లో (టీవీ)లో వచ్చేస్తున్నాయి. మరికొన్ని రెండు నెలలకు వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా 100 రోజులు కూడా పూర్తవ్వక ముందే టీవీల్లో ప్రసారమవుతున్నాయి.  కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన చాలా ఏళ్ల వరకు టీవీల్లో ప్రపారం కాలేదు. రీసెంట్‌గా  నాని నటించిన ‘జెండాపై కపిరాజు’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలు విడుదలైన మూడు నాలుగేళ్ల తర్వాత టీవీల్లో ప్రసారమైంది. కానీ బాలకృష్ణ నటించిన ‘పరమవీర చక్ర’, ‘అధినాయకుడు’ సినిమాలు ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. ఇంత వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోలేదు. బాలయ్య పరమవీరచక్ర విషయానికొస్తే..దాసరి నారాయణరావు 150వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీలో ప్రసారం కాలేదు. అసలు ఈ సినిమా శాటిలైట్ కూడా కాలేదు. మరోవైపు డిజిటల్ హక్కులు కూడా అమ్ముడు పోలేదు. బాలయ్య కెరీర్‌లో ఇంతకంటే దారుణం మరోకటి లేదని అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు.  కానీ హిందీ వెర్షన్‌లో మాత్రం అదే ‘పరమవీరచక్ర’ పేరుతో డబ్ అయి రిలీజైంది.


అపుడెపుడో బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై ఆగిపోయినా.. ‘నర్తనశాల’ సినిమా ఏటీటీలో రీసెంట్‌గా  విడులైన సంగతి తెలిసిందే కదా.  ఈ సినిమాకు సంబంధించిన 12 నిమిషాల ఫుటేజ్‌కు పాత  నర్తనశాలలో నరవరా కురువరా పాటను కొంత యాడ్ చేసి 17 నిమిషాల ఫుటేజ్‌తో ఈ సినిమాను NBK థియేటర్స్, శ్రేయాస్ ఏటీటీలో విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 1 కోటి 25 లక్షల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం.  కొంత మంది  బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘నర్తనశాల’ సినిమా చూసి ఇది ఓ పెద్ద సైజు ట్రైలర్‌లా ఉందని విమర్శలు చేస్తున్నారు. శ్రీహరికి డబ్బింగ్ కూడా సరిగా కుదరలేదు. ఎవరన్నా బేస్ వాయిస్ ఉన్న వారితో చెప్పిస్తే.. బాగుండేది అనే కామెంట్స్ వినబడ్డాయి. మొత్తంగా బాలయ్య ఎక్కడో మరుగునపడిన ‘నర్తనశాల’  సినిమాను ఇపుడు బయటకు తీసి రిలీజ్ చేయడం మంచి పరిణామనే చెప్పాలి.


 ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో బాలయ్య మొదటిసారి త్రిపాత్రాభినయం చేసారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు కూడా ఇప్పటి వరకు అమ్ముడు పోలేదు. ఉన్నంతలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుక్కొంది. అదొక్కటే ఊరట. ఇపుడు యూట్యూబ్‌లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కూడా అవుతోంది. మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ డబ్బింగ్ హక్కులకు మాత్రం మంచి డబ్బులే వచ్చాయి అదొక్కటే ఊరట.


 ఇక చిరంజీవి అతిథి పాత్రలో నటించిన కన్నడ చిత్రం ‘సిపాయి’ చిత్రాన్ని తెలుగులో ‘మేజర్’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ చిత్రం విడుదలైన విషయం చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో సౌందర్య, రవిచంద్రన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు కన్నడ హీరో రవిచంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ.. తానే హీరోగా నటించాడు.



సినిమా థియేటర్స్‌లో విడుదల తర్వాత  ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. కన్నడతో పాటు తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయింది. 1996లో కన్నడలో విడులైన ఈ సినిమా.. 1998లో తెలుగులో ‘మేజర్’  టైటిల్‌తో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మంజునాథ’ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడలో చిత్రీకరించారు. తమిళంలో మాత్రం డబ్ చేసి రిలీజ్ చేసారు. మొత్తంగా బాలకృష్ణ, చిరంజీవి  కెరీర్‌లో వాళ్లు యాక్ట్ చేసిన ఈ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాలు  శాటిలైట్ కాలేదనే చెప్పాలి.



ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>