PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81161fe1-d3fe-4a20-b932-226fa9451607-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కులాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు.. బీసీ కులాలైన రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని సెలూన్‌ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు ఇక ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు. సెలూన్‌ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్ ఆదివారం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చేసింది కూడా. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘkcr;kcr;amala akkineni;vidya;telangana;backward classes;chief minister;good news;april;good newwzఆ రెండు కులాల వారికి గుడ్‌ న్యూస్ చెప్పిన కేసీఆర్..!?ఆ రెండు కులాల వారికి గుడ్‌ న్యూస్ చెప్పిన కేసీఆర్..!?kcr;kcr;amala akkineni;vidya;telangana;backward classes;chief minister;good news;april;good newwzMon, 05 Apr 2021 10:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కులాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు.. బీసీ కులాలైన రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని సెలూన్‌ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు ఇక ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు. సెలూన్‌ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

కేసీఆర్ ఆదివారం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చేసింది కూడా. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశిస్తే.. అధికారులు వెంటనే ఉత్తర్వులను విడుదల చేసేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తరతరాలుగా కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ చెబుతున్నారు.

బలహీనవర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామంటున్న కేసీఆర్.. ఉచిత విద్యుత్తుతో యంత్రపరికరాలు వాడడం ద్వారా వారికి శారీరక శ్రమ తగ్గుతుందన్నారు. అలాగే ఆర్థిక వెసులుబాటు కూడా కలుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ సర్కారు మొదటి నుంచి కులవృత్తులను ప్రోత్సహించే దిశగానే అడుగులు వేస్తోంది. గతంలో యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపలు పంపిణీ చేసింది. ఆయా కులవృత్తుల వారికి పనిముట్లు సరఫరా చేసే ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాదు.. కులాల ప్రాతిపదికన హైదరాబాద్‌లో భవనాల నిర్మాణానికి కూడా కేసీఆర్ పచ్చజెండా ఊపారు. అయితే కులాల ప్రాతిపదికన తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను కొందరు తప్పుబడుతున్నారు. కేసీఆర్ మళ్లీ సమాజాన్ని కుల చట్రంలోకి తీసుకెళ్తున్నారంటున్నారు. కేసీఆర్ తాజా నిర్ణయంతో.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని సెలూన్‌ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు ఇక ఉచితంగా  కరెంట్ అందనుంది.





పవన్ బీజేపీకి భయపడే అవసరమే లేదా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>