MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2fc28796-7943-400a-a3c5-f879e24d735f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2fc28796-7943-400a-a3c5-f879e24d735f-415x250-IndiaHerald.jpgప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా ఎప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం సాయంత్రం శిల్ప‌క‌లా వేధిక‌లో వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ...."చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండగ వకీల్ సాబ్. మన అందరి తరుపున పవన్ గారికి థాంక్స్. పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ట్ చేసినందుకు ఆయనకు పెద్ద థాంక్స్. ఆయన సినిమాల వల్లharish shanker;pawan;harish shankar;kalyan;pawan kalyan;prema;sandhya;shankar;sriram;tara;vedhika;venu;tollywood;industries;cinema;cinema theater;smart phone;love;film industry;event;evening;gabbar singh;dil;venu thottempudiపవన్ కళ్యాణ్ పై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!పవన్ కళ్యాణ్ పై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!harish shanker;pawan;harish shankar;kalyan;pawan kalyan;prema;sandhya;shankar;sriram;tara;vedhika;venu;tollywood;industries;cinema;cinema theater;smart phone;love;film industry;event;evening;gabbar singh;dil;venu thottempudiMon, 05 Apr 2021 08:04:15 GMTప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా ఎప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం సాయంత్రం శిల్ప‌క‌లా వేధిక‌లో వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ...."చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండగ వకీల్ సాబ్. మన అందరి తరుపున పవన్ గారికి థాంక్స్. పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ట్ చేసినందుకు ఆయనకు పెద్ద థాంక్స్. ఆయన సినిమాల వల్ల వందల కోట్ల టర్నోవర్ తో తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ నుంచి మళ్లీ కోలుకుంటోంది. వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. లాక్ డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకు, నటీనటులకు, టెక్నీషియన్ కు ఈ వేదిక మీద నుంచి థాంక్స్. టాలీవుడ్ అంతా మన కుటుంబమే అనుకునే వ్యక్తి పవన్ గారు. 

ఫలానా సినిమా హిట్ అయింది అంటే ఆయన చాలా సంతోషపడతారు. ఆ తర్వాత అడుగుతారు ఎవరి సినిమా అని. ఆయనకు ఎవరి సినిమా అనేది సంబంధం లేదు. అన్ని సినిమాలు హిట్ కావాలి. అందరూ బాగుండాలని పవన్ గారు కోరుకుంటారు. తొలి ప్రేమ వందో రోజు నాకింకా గుర్తుంది. జనం కిటకిటలాడుతూ సంధ్య థియేటర్ లో  రిపీట్ షోస్ పడుతున్నాయి. నేను ఆ గుంపులో షో కు వెళ్లేందుకు వేచి చూస్తున్నాను. అక్కడ కటౌట్ చూస్తూ ఒక కుర్రాడు ఈ హీరోతో సినిమా దర్శకత్వం  చేయాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న మరో డిస్ట్రిబ్యూటర్ ఈ హీరోతో సినిమా నిర్మించాలను కల గన్నాడు. దర్శకత్వం చేయాలనుకున్న కుర్రాడిని నేనైతే, సినిమా నిర్మించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు. మా ఇద్దరి కలలు పవర్ స్టార్ చిత్రాలతో తీరాయి. రాజు గారు ఏ కథ విన్నా, క్యారెక్టర్ విన్నా నాకు ఫోన్ చేసి ఈ కథ, క్యారెక్టర్ పవన్ గారికి పడితే నెక్ట్ లెవెల్ ఉంటుంది హరీష్ అంటాడు.

ఇక్కడున్న అందరిలో గబ్బర్ సింగ్ సినిమా ఎక్కువ సార్లు చూసింది దర్శకుడు శ్రీరామ్ వేణునే అనుకుంటా. నందాజీ కూర్చొండి చాలు అనే ఒక్క డైలాగ్ చాలు మనం వకీల్ సాబ్ పదే పదే చూసేందుకు. వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తయ్యిన తర్వాత పవన్ గారిని కలిశాను. రాత్రి నుంచి మార్నింగ్ దాకా డబ్బింగ్ చెప్పారట కదా అని అడిగాను. ఆయన రాత్రంతా డబ్బింగ్ చెప్పినా మొహంలో అలసట కనిపించలేదు. ఒక తృప్తి కనిపించింది. మంచి సినిమా చేశాననే సంతోషం కనిపించింది. ఆ సంతోషం ఏంటో ఏప్రిల్ 9న మీరు చూస్తారు. ఏ కీలుకు ఆ కీలు తీసే వకీల్ సాబ్ ను ట్రైలర్ లో చూశాం. పవర్ స్టార్ సినిమా గురించి మీరెంత ఆకలిగా ఉన్నారో నేనూ అలాగే వేచి చూస్తున్నాను. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఏప్రిల్ 9 థాంక్స్." అంటూ హ‌రీష్ శంక‌ర్ స్పీచ్ ముంగించారు.





బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>