EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/perni-nani-pawan-kalyan-tirupati-by-poll-ce6f1ec4-09fc-4bc4-b91e-9ff8b2f66b68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/perni-nani-pawan-kalyan-tirupati-by-poll-ce6f1ec4-09fc-4bc4-b91e-9ff8b2f66b68-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ పరిధిలో కాపు సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉందని, జనసేన తరపున అభ్యర్థిని నిలబెడితే.. వారంతా పవన్ కి మద్దతు తెలుపుతారని అనుకున్నారంతా. కానీ చివరి నిముషంలో ఆ సీటు బీజేపీకి కేటాయించడం, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో దిగడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు బలిజల ఓట్లు ఎవరికి పడతాయనేదే సస్పెన్స్. పవన్ కల్యాణ్ పార్టీ బరిలో లేదు కాబట్టి.. ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేస్తారా, లేదా టీడీపీ వైపు వెళ్తారా, అధికార వైసీపీతో ఉంటారా అనేది తేలాల్సి ఉంది. పవన్ పర్యటనలో పదే పదే కాపు perni nani, pawan kalyan, tirupati by poll,;pawan;view;nani;dharma;pawan kalyan;prema;rachana;tiru;bharatiya janata party;jagan;janasena;balija;tirupati;bank;love;perni nani;minister;husband;tdp;ycp;janasena party;partyతిరుపతి బరిలో బలిజల ఓట్లు.. ఎవరికెన్ని..?తిరుపతి బరిలో బలిజల ఓట్లు.. ఎవరికెన్ని..?perni nani, pawan kalyan, tirupati by poll,;pawan;view;nani;dharma;pawan kalyan;prema;rachana;tiru;bharatiya janata party;jagan;janasena;balija;tirupati;bank;love;perni nani;minister;husband;tdp;ycp;janasena party;partyMon, 05 Apr 2021 08:00:00 GMTతిరుపతి లోక్ సభ పరిధిలో కాపు సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉందని, జనసేన తరపున అభ్యర్థిని నిలబెడితే.. వారంతా పవన్ కి మద్దతు తెలుపుతారని అనుకున్నారంతా. కానీ చివరి నిముషంలో ఆ సీటు బీజేపీకి కేటాయించడం, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో దిగడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు బలిజల ఓట్లు ఎవరికి పడతాయనేదే సస్పెన్స్. పవన్ కల్యాణ్ పార్టీ బరిలో లేదు కాబట్టి.. ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేస్తారా, లేదా టీడీపీ వైపు వెళ్తారా, అధికార వైసీపీతో ఉంటారా అనేది తేలాల్సి ఉంది. పవన్ పర్యటనలో పదే పదే కాపు సామాజిక వర్గాన్ని గుర్తు చేస్తూ మాట్లాడటం కూడా ఈ వ్యూహంలో భాగమే.

కొండపై వ్యాపారాలు చేసుకుంటున్న బలిజలను బెదిరిస్తున్నారని, ఇలా చేయడం దుర్మార్గం అని పవన్ కల్యాణ్ తిరుపతి ప్రచారంలో విమర్శించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తాను కూడా బలిజనే అని, బలిజ కులస్తుడిగా చెబుతున్నా.. తమ వర్గమంతా వైసీపీకే అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ కల్యాణ్, వారికి ఊడిగం చేస్తున్నారని అద్దెమైకుగా మారిపోయి ఎవరు అద్దెకు తీసుకుంటే వారి తరపున మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఒకరకంగా పేర్ని నాని వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్ సామాజిక వర్గాన్ని గుర్తు చేస్తూ ఆయనపై మండిపడ్డారు.

ఇప్పటి వరకూ తిరుపతి పరిధిలోని కాపు సామాజిక వర్గ ఓట్లు టీడీపీకే అనుకూలంగా ఉండేవి.  ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాకతో ఆయనకు ఆ సామాజిక వర్గం మద్దతిస్తుందని అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో కూడా పవన్, తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా పొత్తు ధర్మం పాటిస్తూ మిత్రపక్షానికి సీటు వదులుకున్నారు. ఉప ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కూడా బీజేపీకి సీటు త్యాగం చేశారు. అయితే తమ సామాజిక వర్గం ఓట్లన్నీ బీజేపీ అభ్యర్థికి పడేలా పవన్ వ్యూహ రచన చేశారు. పవన్ చేశారని చెప్పడం కంటే.. ఇదంతా బీజేప వ్యూహమేనని చెప్పాలి. అందుకే తిరుపతిలో ఆయనతో బహిరంగ సభ పెట్టించి మరీ ప్రచార చేయించారు. దీంతో ఓటు బ్యాంకు బీజేపీవైపు మళ్లే ప్రమాదం ఉందని, మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. కాపులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారని, కాపులకు న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని గుర్తు చేశారు. మొత్తమ్మీద అటు బీజేపీ, ఇటు వైసీపీ, మధ్యలో టీడీపీ.. కాపు వర్గం ఓట్లకోసం కొట్టుకుంటున్నాయి.


బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>