MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips16311e0f-5fcd-4877-b9b3-5ac6859a92c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips16311e0f-5fcd-4877-b9b3-5ac6859a92c8-415x250-IndiaHerald.jpgసినిమా ప్రేక్షకులకు వెండితెర మీద సినిమా చూడటం ఎంత సంతోషాన్ని ఇస్తుందో బుల్లితెర మీద కూడా చూడటం అంతే సంతోషాన్ని ఇస్తుంది. ఒకప్పుడు థియేటర్ లలో బాగా హిట్ అయిన సినిమాలు సంవత్సరం రెండు సంవత్సరాలు తరువాత కాని టీవిల్లో టెలికాస్ట్ కావు. తరువాత కాలక్రమేణా 6 నెలలకు ఒకసారి అలా టీవిల్లో ప్రదర్శించబడుతున్నాయి.ఇప్పటిరోజుల్లో అయితే సినిమా విడుదలైన 100 రోజుల్లోపే టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. చాలా ఏళ్ళ నుండీ పెండింగ్ లో ఉన్న 'జెండా పై కపిరాజు', 'ఏటో వెళ్ళిపోయింది' మనసు వంటి చిత్రాలు కూడా ఈ మధ్యనే టీవీల్లో టtollywood-gossips;business;chiranjeevi;balakrishna;shiva;boyapati srinu;dasari narayana rao;koratala siva;cinema;telugu;cinema theater;kannada;lord sivaఇప్పటివరకు బుల్లి తెరపై సందడి చెయ్యని చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఇవేనటా....ఇప్పటివరకు బుల్లి తెరపై సందడి చెయ్యని చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఇవేనటా....tollywood-gossips;business;chiranjeevi;balakrishna;shiva;boyapati srinu;dasari narayana rao;koratala siva;cinema;telugu;cinema theater;kannada;lord sivaMon, 05 Apr 2021 20:30:00 GMTసినిమా ప్రేక్షకులకు వెండితెర మీద సినిమా చూడటం ఎంత సంతోషాన్ని ఇస్తుందో బుల్లితెర మీద కూడా చూడటం అంతే సంతోషాన్ని ఇస్తుంది. ఒకప్పుడు థియేటర్ లలో బాగా హిట్ అయిన సినిమాలు సంవత్సరం రెండు సంవత్సరాలు తరువాత కాని టీవిల్లో టెలికాస్ట్ కావు. తరువాత కాలక్రమేణా 6 నెలలకు ఒకసారి అలా టీవిల్లో ప్రదర్శించబడుతున్నాయి.ఇప్పటిరోజుల్లో అయితే సినిమా విడుదలైన 100 రోజుల్లోపే టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. చాలా ఏళ్ళ నుండీ పెండింగ్ లో ఉన్న 'జెండా పై కపిరాజు', 'ఏటో వెళ్ళిపోయింది' మనసు వంటి చిత్రాలు కూడా ఈ మధ్యనే టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి.శాటిలైట్ హక్కులకు ఆ రేంజ్లో డిమాండ్ కూడా పెరిగింది. కానీ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ కాలేదు.వాళ్ళ సినిమాలకు ఇంకా శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా జరగకపోవడం షాకిచ్చే అంశం. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలే..! నటసింహం బాలకృష్ణ హీరోగా 'పరమ వీర చక్ర' మరియు 'అధినాయకుడు' సినిమాలు వచ్చాయి.


వీటిలో 'పరమ వీర చక్ర' సినిమా దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్లో రూపొందింది. ఇది ఆయనకి 150వ చిత్రం కావడం విశేషం.2011లో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. దాంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడు పోలేదు. 'అధినాయకుడు' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన కన్నడ చిత్రం 'సిపాయి' ని కూడా తెలుగులో 'మేజర్' పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం ప్లాప్ అవ్వడంతో శాటిలైట్ హక్కులు ఇప్పటికీ అమ్ముడు పోలేదు.ఇక వీరి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే...మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమాతో విడుదలకి సిద్ధంగా వున్నడు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. ఇక బాలకృష్ణ మూడవ సారి బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి...



సల్మాన్ మాస్టర్ రీమేక్ తో పోకిరి రీమేక్ అంత బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>