PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-naidu5d929774-a951-42e5-9b4b-2a4dd9eae9e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-naidu5d929774-a951-42e5-9b4b-2a4dd9eae9e5-415x250-IndiaHerald.jpg చిత్తూరు జిల్లాలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌చారంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కొద్ది రోజులుగా అక్క‌డే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అచ్చెన్న ప్ర‌చారంలో ఊహించ‌ని షాకింగ్ విష‌యం చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు సీఎం కావాలి అంటూ కొందరు యువకులు నినాదాలు చేశారు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. ఆదివారం తిరుపతిలోని బాలాజీ కాలనీ జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారంలో Chandra babu naidu;naga chaitanya;tiru;vijayawada;andhra pradesh;district;sri venkateswara swamy;chief minister;letter;tdp;local language;yuva;chaitanya 1;yatra;partyబాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!Chandra babu naidu;naga chaitanya;tiru;vijayawada;andhra pradesh;district;sri venkateswara swamy;chief minister;letter;tdp;local language;yuva;chaitanya 1;yatra;partyMon, 05 Apr 2021 08:25:00 GMTమాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆయ‌న సొంత జిల్లాలోనే అదిరిపోయే షాక్ త‌గిలింది. చిత్తూరు జిల్లాలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌చారంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కొద్ది రోజులుగా అక్క‌డే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అచ్చెన్న ప్ర‌చారంలో ఊహించ‌ని షాకింగ్ విష‌యం చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు సీఎం కావాలి అంటూ కొందరు యువకులు నినాదాలు చేశారు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.

ఆదివారం తిరుపతిలోని బాలాజీ కాలనీ జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారంలో భాగంగా తెలుగు యువత నేతృత్వంలో యువ చైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అచ్చెన్నాయుడు పాల్గొని యాత్ర ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్థానికులే కాకుండా విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. వారిలో కొందరు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. వెంట‌నే అక్క‌డే ఉన్న కొంద‌రు టీడీపీ నేత‌లు, చిత్తూరు జిల్లా నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు.

వారు వెంట‌నే తేరుకుని... నినాదాలు చేస్తున్న వారిని వారించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. యువత తిరగబడాలి.. అధికారపార్టీ నేతలను నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. అచ్చెన్న పిలుపు సంగ‌తేమో గాని ఓపెన్‌గానే అచ్చెన్న సీఎం కావాల‌న్న నినాదాలు రావ‌డం.. అది కూడా చంద్ర‌బాబు సొంత జిల్లాలో ఇలా జ‌ర‌గ‌డంతో పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని ఇంకా ఇష్ట‌ప‌డేందుకు ఆ పార్టీలో చాలా మంది సిద్ధంగా లేర‌న్న దానిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది.



చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?

అనసూయకీ ఒక ఈవెంట్ కి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>