SatireGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yanamala-rama-krishna0a3e878c-e531-491f-9164-cd29ec0c3a97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అప్పుల విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా సరే ఏపీలో అప్పులు మాత్రం తగ్గడం లేదు. ఇక ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏపీలో నెలకొంది అనే మాట వాస్తవం. ఏపీ సర్కార్ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో తప్పులు ఎక్కువగా చేయడంతో అప్పులు పెరుగుతున్నాయి. తెచ్చిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు సర్కార్ వాడటం అభివ్రుద్దికి వాడకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే యనమల రామకృష్ణుడు కీలక విషయాలు బయటపెట్టారు. రyanamala,ap;ramakrishna;jagan;andhra pradesh;arogyasri;reddyహెరాల్డ్ సెటైర్:ఏపీలో ఒక్కొక్కరి తలపై ఎంత అప్పు ఉంది...?హెరాల్డ్ సెటైర్:ఏపీలో ఒక్కొక్కరి తలపై ఎంత అప్పు ఉంది...?yanamala,ap;ramakrishna;jagan;andhra pradesh;arogyasri;reddyMon, 05 Apr 2021 14:22:56 GMTఆంధ్రప్రదేశ్ లో అప్పుల విషయంలో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా సరే ఏపీలో అప్పులు మాత్రం తగ్గడం లేదు. ఇక ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏపీలో నెలకొంది అనే మాట వాస్తవం. ఏపీ సర్కార్ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో తప్పులు ఎక్కువగా చేయడంతో అప్పులు పెరుగుతున్నాయి. తెచ్చిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు సర్కార్ వాడటం అభివృద్ధి కి వాడకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే యనమల రామకృష్ణుడు కీలక విషయాలు బయటపెట్టారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు అని ఆరోపణలు చేసారు. జగన్ రెడ్డి అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఆదాయం , అప్పుల ద్వారా వచ్చిన సొమ్ము ఏమవుతోంది జగన్ రెడ్డీ.?  అని నిలదీశారు. జీతాలు, పెన్షన్లు, సంక్షేమం కోసం కూడా  అప్పులేనా.? అని ఆయన ప్రశ్నించారు. డబ్బులివ్వకపోవడంతో ప్రైవేటులో ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా.? అని నిలదీశారు.

ఫిబ్రవరికే రూ.79,191.58 కోట్లు అప్పులు చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు అని అన్నారు. గతేడాది కంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ రూ.5వేల కోట్లు పెరిగింది అని అన్నారు. ల్యాండ్ రెవెన్యూ ఆదాయం గతేడాది కంటే రూ.103 కోట్లు పెరిగింది అని ఆయన పేర్కొన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ గతేడాది కంటే రూ.10వేల కోట్లు ఎక్కువైంది అని అన్నారు. గతేడాది కంటే రూ.29,109 కోట్లు అధనపు ఆదాయం వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సమయంలోని విరాళాలన్నీ ఎటు పోయాయి.. జగన్ రెడ్డీ.? అని నిలదీశారు. ఒక్కో వ్యక్తి నెత్తిన అప్పు రూ.70 వేల అప్పు పెట్టారు అని అన్నారు. 3 నెలల్లోనే రూ.73,812 కోట్ల అప్పు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి నిదర్శనం అని మండిపడ్డారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు డబ్బుమాత్రం మాయమవుతోందని మండిపడ్డారు.


నాగార్జున సాగర్ లో టీడీపీ ఎమ్మెల్యేల ప్రచారం...?

జగన్ ఇంట్లోనే ప్రతిపక్షం...?

లైవ్ లో అందరికి ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్..!!

రంగ ఫోటో మాత్రమే వాడుతున్నారు: జనసేన ఫైర్

మా ఎంపీలు గొర్రెలు సరే... మరి మీ: మంత్రి

తెలంగాణాలో ఫేక్ జీవో... ఏమైంది అసలు...?

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>