PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/leaders-teaching-babu-a-lesson26ca7988-47bc-42cf-a99f-ea855425b973-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/leaders-teaching-babu-a-lesson26ca7988-47bc-42cf-a99f-ea855425b973-415x250-IndiaHerald.jpg ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది..నోటిఫికేషన్ ఏకపక్షంగా విడుదల చేశారని టీడీపీ జెడ్పీటీసీ, ఎం‌పి‌టి‌సి ఎన్నికలను బహిష్కరిస్తునట్లు ప్రకటించింది. దీంతో చంద్రబాబు నిర్ణయంతో సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. క్యాడర్ లో అందరి అభిప్రాయాలను తీసుకోకుండా ఇలా ఎన్నికలను బహిష్కరించడం సమంజసం కాదని ఆ పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, బండారు సత్య నారాయణ, జ్యోతుల నెహ్రూ వంటి వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. .latest news;cbn;ashok;satya;tiru;bandara;telugu;letter;tdp;corporate;partyబాబుకు పాఠం నేర్పుతున్న నేతలు..!బాబుకు పాఠం నేర్పుతున్న నేతలు..!latest news;cbn;ashok;satya;tiru;bandara;telugu;letter;tdp;corporate;partyMon, 05 Apr 2021 11:00:57 GMT ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది..నోటిఫికేషన్ ఏకపక్షంగా విడుదల చేశారని టీడీపీ జెడ్పీటీసీ, ఎం‌పి‌టి‌సి ఎన్నికలను బహిష్కరిస్తునట్లు ప్రకటించింది. దీంతో చంద్రబాబు నిర్ణయంతో సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. క్యాడర్ లో అందరి అభిప్రాయాలను తీసుకోకుండా ఇలా ఎన్నికలను బహిష్కరించడం సమంజసం కాదని ఆ పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, బండారు సత్య నారాయణ, జ్యోతుల నెహ్రూ వంటి వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. .

అయితే ఒకరిద్దరు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించినంత మాత్రాన అభిప్రాయం మారదని చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.. టీడీపీ అధిష్టానం పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికి  ఆయా నేతలు ఇంకా ఎన్నికల బరిలోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో క్లిష్ట పరిష్టితులను ఎదుర్కొంటుంది..

గత సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని ఇటీవల జరిగిన కార్పొరేట్ ఎన్నికల వరకు పార్టీ బలం కోల్పోతునే ఉంది..ఈ నేపథ్యంలో పార్టీని బలపరచాల్సిన చంద్రబాబు ఇలా ఎన్నికలను వాయిదా వెయ్యడంవల్ల పార్టీపై మరింత ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పార్టీని బలోపేతం చెయ్యడంలో చంద్రబాబు విఫలం అయిన పార్టీలోని కొందరు నేతలు మాత్రం అధిష్టానం మాటలను కతారు చేయకుండా పోటీలో నిలవడం..క్యాడర్ ను బలపరచడమే అవుతుందని మరికొందరి అభిప్రాయం. మరి ఏది ఏమైనప్పటికి పరిషత్ ఎన్నికలు టీడీపీ క్యాంప్ లో కొత్త చిక్కులను తెచ్చిపెట్టాయి. మరి చంద్ర బాబు పరిషత్ ఎన్నికలపై నిర్ణయం మార్చుకుంటాడా లేక పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది .



ఈ సంవత్సరం బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు తెలుసా..?

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !

కృతి శెట్టి డిమాండ్స్ కు షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

బన్నీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పని చేయనున్నాడా..?

ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్...?

మోడీ సర్కార్ మీద ఉండవల్లి నిప్పులు... ఆ పని చేయాలంటే అంటూ...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>