PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narayana-tdpcae09756-aa83-4eda-ab95-90a1145fc340-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narayana-tdpcae09756-aa83-4eda-ab95-90a1145fc340-415x250-IndiaHerald.jpgఆయన ఓ మాజీ మంత్రి.. చంద్రబాబు హయాంలో ఆయన మామూలుగా చక్రం తిప్పలేదు. అసలు అమరావతి నగర నిర్మాణ బాధ్యతలంతా భుజాలపై మోశారు. అప్పట్లో ఎక్కడు చూసినా ఆ మంత్రి గారి పేరే.. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ ఆయనే.. అలాంటిది ఇప్పుడు ఆ మంత్రిగారు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన గురించి వార్తలు వెదుకుదామన్నా కనిపించడం లేదు. తెలుగు దేశం అధికారం నుంచి దిగిపోయిన నాటి నుంచి అంతగా ఆయన ఎక్కడా బయట కనిపించడం లేదు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో గుర్తొచ్చారా.. ఆయనే పొందూరు నారాయణ. నారాయణ విద్యాసంస్థల అధినేత ఆయన. దానికి తోడు ఇటీవలnarayana-tdp;tiru;beeda ravichandra;amaravati;2019;district;tirupati;assembly;minister;husband;tdp;partyసెటైర్ : ఈ మాజీ మంత్రి కనబడుట లేదు..!సెటైర్ : ఈ మాజీ మంత్రి కనబడుట లేదు..!narayana-tdp;tiru;beeda ravichandra;amaravati;2019;district;tirupati;assembly;minister;husband;tdp;partyMon, 05 Apr 2021 09:00:00 GMTఆయన ఓ మాజీ మంత్రి.. చంద్రబాబు హయాంలో ఆయన మామూలుగా చక్రం తిప్పలేదు. అసలు అమరావతి నగర నిర్మాణ బాధ్యతలంతా భుజాలపై మోశారు. అప్పట్లో ఎక్కడు చూసినా ఆ మంత్రి గారి పేరే.. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ ఆయనే.. అలాంటిది ఇప్పుడు ఆ మంత్రిగారు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన గురించి వార్తలు వెదుకుదామన్నా కనిపించడం లేదు. తెలుగు దేశం అధికారం నుంచి దిగిపోయిన నాటి నుంచి అంతగా ఆయన ఎక్కడా బయట కనిపించడం లేదు.  

ఇంతకీ ఆ మంత్రి ఎవరో గుర్తొచ్చారా.. ఆయనే పొందూరు నారాయణ. నారాయణ విద్యాసంస్థల అధినేత ఆయన. దానికి తోడు ఇటీవల అమరావతి భూముల వివాదంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది కదా. అంతే కాదు.. ఈ భూముల విషయంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై విచారణ జరుగుతోంది. ఇటీవల ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన నివాసాల్లో సీఐడీ సోదాలు కూడా జరిగాయి. గతంలో నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు కనిపించడమే మానేశారు.

నారాయణే కాదు.. గతంలో అధికారం అనుభవించిన టిడిపి నేతలు ఎవరూ ఇప్పుడు పార్టీకి పనిచేయడానికి పెద్దగా ముందుకు రావడం లేదు.. ఇక మాజీ మంత్రి నారాయణ అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు టీడీపీలో ఉన్న సందడి.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు కదా. అధికారం కోల్పోవడంతో పాటు అనేక సమీకరణాల దృష్ట్యా మాజీ మంత్రి నారాయణ రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిలు మాత్రమే అడపాదడపా కనిపిస్తున్నారు. ఓ వైపు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సాగుతున్నా నారాయణ వంటి నేతలు మాత్రం కనిపించడం లేదు.





యనమల ఇబ్బంది పెడుతున్నారా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>