EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-tdp-parisht-elections-boycotting-tirupati-by-polls-atchennaidua6056445-b8e0-407e-9f69-c004bab2b514-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/naidu-tdp-parisht-elections-boycotting-tirupati-by-polls-atchennaidua6056445-b8e0-407e-9f69-c004bab2b514-415x250-IndiaHerald.jpgగంటలపాటు పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని సీనియర్లే కొందరు లెక్క చేయకపోవటంతో చంద్రబాబుకు షాకిచ్చినట్లయ్యింది. మొన్నటివరకు ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించింది లేదు. అలాంటిది ఇపుడు బహిరంగంగానే ఎదురుతిరుగుతున్నారంటే పార్టీలో ఏమి జరుగుతోందో బహుశా చంద్రబాబుకు కూడా అర్ధం అవుతున్నట్లు లేదు. చంద్రబాబు మాటగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మొత్తుకుంటున్నారు. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు నిర్ణయం తీసుకnaidu tdp parisht elections boycotting tirupati by polls atchennaidu;cbn;tiru;visakhapatnam;n. chandrababu naidu;vishakapatnam;tdp;s radhakrishna;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : పార్టీలో ఏమి జరుగుతోందో చంద్రబాబుకైనా అర్ధమవుతోందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : పార్టీలో ఏమి జరుగుతోందో చంద్రబాబుకైనా అర్ధమవుతోందా ?naidu tdp parisht elections boycotting tirupati by polls atchennaidu;cbn;tiru;visakhapatnam;n. chandrababu naidu;vishakapatnam;tdp;s radhakrishna;partyMon, 05 Apr 2021 05:00:00 GMTతన పార్టీలో ఏమి జరుగుతోందో చంద్రబాబునాయుడుకైనా తెలుసా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బహిష్కరణ అంటు చంద్రబాబు ఇలా ప్రకటించారో లేదో వెంటనే నేతల్లో తిరుగుబాటు మొదలైపోయింది. చంద్రబాబు ప్రకటించిన బహిష్కరణను తాము పట్టించుకునేది లేదని కొందరు సీనియర్ నేతలు తెగేసి చెప్పేశారు. చెప్పటమే కాకుండా ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. విజయనగరం, వైజాగ్, పశ్చిమగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల టీడీపీ నేతలు తమ మద్దతుదారులకు ప్రచారం కూడా చేస్తున్నారు. అప్పుడెప్పుడో ఏడాది క్రితం నామినేషన్లు వేసిన తర్వాత ఇపుడు బహిష్కరణ అంటే కుదరదని అభ్యర్ధులు కూడా చెప్పేశారు.




గంటలపాటు పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి తీసుకున్న బహిష్కరణ నిర్ణయాన్ని సీనియర్లే కొందరు లెక్క చేయకపోవటంతో చంద్రబాబుకు షాకిచ్చినట్లయ్యింది. మొన్నటివరకు ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించింది లేదు. అలాంటిది ఇపుడు బహిరంగంగానే ఎదురుతిరుగుతున్నారంటే పార్టీలో ఏమి జరుగుతోందో బహుశా చంద్రబాబుకు కూడా అర్ధం అవుతున్నట్లు లేదు.  చంద్రబాబు మాటగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మొత్తుకుంటున్నారు. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా వ్యతిరేకంగా వ్యవహరించేందుకు లేదని చెప్పినా ఎవరు పట్టించుకోవటంలేదు.




నేతలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడుండాల్సిందే అని అచ్చెన్న హూంకరిస్తున్నా కొందరు లెక్క చేయటంలేదు. అచ్చెన్న వార్నింగులు వార్నింగులే తాము పోటీ చేసేది చేసేదే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ధైర్యంగా ప్రచారం చేసుకోలేక, అలాగని పార్టీ నిర్ణయానికి కట్టుబడుండలేక మరికొందరు సీనియర్ నేతలు+అభ్యర్ధులు అవస్తలు పడుతున్నారు. మొత్తానికి ఇక్కడ అర్ధం అవుతున్నదేమంటే చంద్రబాబు బెదిరింపులను నేతల్లో చాలామంది పట్టించుకోవటంలేదని. అందుకనే గతంలో లాగ క్రమశిక్షణ తప్పిన నేతలపై వేటు వేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మాత్రం అటు చంద్రబాబు ఇటు అచ్చెన్న హెచ్చరించలేకపోతున్నారు. తాజా పరిణామాలతో పార్టీలో ఏమి జరుగుతోందో కూడా చంద్రబాబు, చినబాబులకు అర్ధం అవుతున్నట్లు లేదు. చూద్దాం అంతిమంగా ఏమి జరుగుతుందో.





సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సారంగదరియా పాట....?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>