MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/vallabhaneni-vamsi4ee7e3f3-d377-4b65-b38e-967ef64eb3fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/vallabhaneni-vamsi4ee7e3f3-d377-4b65-b38e-967ef64eb3fd-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం...మొన్నటివరకు టీడీపీకి కంచుకోట. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వచ్చేశారో అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ జీవితాన్ని టీడీపీలో ప్రారంభించిన వంశీ...2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో గన్నవరం టికెట్ దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, 2019 లో కూడా టీడీపీ నుంచే పోటీ చేసి గెలుపొందారు.vallabhaneni vamsi;amala akkineni;arjuna;tiru;vamsi;krishna river;vijayawada;2019;district;gannavaram;vallabhaneni vamsi;mla;fort;krishna district;tdp;ycp;party;bachula arjunuduహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?vallabhaneni vamsi;amala akkineni;arjuna;tiru;vamsi;krishna river;vijayawada;2019;district;gannavaram;vallabhaneni vamsi;mla;fort;krishna district;tdp;ycp;party;bachula arjunuduSun, 04 Apr 2021 05:00:00 GMT

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం...మొన్నటివరకు టీడీపీకి కంచుకోట. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వచ్చేశారో అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ జీవితాన్ని టీడీపీలో ప్రారంభించిన వంశీ...2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో గన్నవరం టికెట్ దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, 2019 లో కూడా టీడీపీ నుంచే పోటీ చేసి గెలుపొందారు.


అయితే టీడీపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో అనూహ్యంగా జగన్‌కు మద్ధతు తెలిపారు. కాకపోతే వైసీపీలో చేరకుండానే, ఆ పార్టీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  ఇక వంశీ  ఏ పార్టీలో ఉన్నా సరే ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఇది సమస్య అని చెబితే...వాటి పరిష్కారానికి వంశీ కృషి చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు నేరుగా తన ఇంటి వద్దకే వచ్చి సమస్యలు చెప్పుకునే వీలు కల్పించారు.


అలాగే ఎన్నో ఏళ్లుగా మొదలు కానీ బుడమేరు కాలువపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేసుకున్నారు.  ఇక వంశీ ఎలాగో అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉండటంతో, నియోజకవర్గంలో పలు పనులకు నిధులు త్వరగా వస్తున్నాయి. నియోజకవర్గాలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి దాదాపు 35 కోట్లు మంజూరు అయ్యాయి. అదేవిధంగా కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి చేత ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు కూడా గన్నవరంలో సంతృప్త స్థాయిలోనే అమలు అవుతున్నాయి.


రాజకీయ పరంగా చూసుకుంటే గన్నవరంలో వంశీకి తిరుగులేదనే చెప్పొచ్చు. ఈయనకు పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. అటు టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. అర్జునుడుకు నియోజకవర్గంలో అంత ఫాలోయింగ్ లేదు. ఇక్కడ పూర్తిగా వంశీ హవానే ఉంది. మొన్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కేలా చేశారు. ఇక పరిషత్ ఎన్నికల్లో కూడా వంశీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా టీడీపీ పోటీలో లేకపోవడం మరింత అడ్వాంటేజ్. మొత్తానికైతే గన్నవరంలో వంశీ పర్మినెంట్ ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తున్నారు.






శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో రెచ్చిపోయిన హైపర్ ఆది...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>