PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-bijapur-encounter-625d920f-cd10-451c-89d2-245c7fd26ac8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-bijapur-encounter-625d920f-cd10-451c-89d2-245c7fd26ac8-415x250-IndiaHerald.jpgతమకు అనువుగా ఉండే ప్రాంతంలోకి భద్రతాబలగాలు వచ్చే దాకా వేచిచూసిన నక్సల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాదాపు 600 మంది నక్సల్స్ 'యు' ఆకారంలో మోహరించి ఏకే-47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఐఈడీ పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డారు. ఈ తరహా మోహరింపునే 'అంబ్రెల్లా ఫార్మేషన్' అంటారు.bijapur encounter;view;amit shah;amith shah;minister;central governmentమావోయిస్టుల ఎలా విరుచుకుపడ్డారు? బీజాపూర్ లో అసలేం జరిగింది?మావోయిస్టుల ఎలా విరుచుకుపడ్డారు? బీజాపూర్ లో అసలేం జరిగింది?bijapur encounter;view;amit shah;amith shah;minister;central governmentSun, 04 Apr 2021 20:10:25 GMT
కూంబింగ్ ఆపరేషన్ లో ఉన్న భద్రతా బలగాలు తామున్న ప్రాంతానికి వస్తాయని ముందే ఊహించిన మావోయిస్టులు.. అందుకు తగిన విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.400 మందితో కూడిన భద్రతాబలగాల కూంబింగ్ బృందం తరెం ఏరియాలో ప్రవేశించింది. అయితే తమకు అనువుగా ఉండే ప్రాంతంలోకి భద్రతాబలగాలు వచ్చే దాకా వేచిచూసిన నక్సల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాదాపు 600 మంది నక్సల్స్ 'యు' ఆకారంలో మోహరించి ఏకే-47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఐఈడీ పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డారు. ఈ తరహా మోహరింపునే 'అంబ్రెల్లా ఫార్మేషన్' అంటారు.

మావోయిస్టుల వ్యూహం గురించి భద్రతా బలగాలు పసిగట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడు వైపుల నుంచి దాడి జరగడంతో భద్రతా బలగాలు స్పందించడానికి తగిన సమయం చిక్కలేదు. ఏ దిశగా కాల్పులు జరపాలని నిర్ణయం తీసుకునేలోపే పెద్దసంఖ్యలో భద్రతా సిబ్బంది మావోల తూటాలకు నేలకొరిగారు. 100 నుంచి 200 మీటర్ల దూరం నుంచే మావోలు దాడి చేయడంతో తప్పించుకోవడం భద్రతా బలగాలకు కష్టసాధ్యమైంది. తేరుకున్న భద్రతా దళాలు కూడా ఎదురుదాడికి దిగినా మావోలకు జరిగిన నష్టం స్వల్పమే. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందినట్టు భావిస్తున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో అటవీ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.




చీరకట్టుతో చింపేసిన హాట్ బ్యూటీ...?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>