Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits36cbe73c-1d62-480e-a0f6-8833c48d9115-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits36cbe73c-1d62-480e-a0f6-8833c48d9115-415x250-IndiaHerald.jpgశరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. పండ్లు ఒక్కటే మనకు కడుపు నింపలేవు. శరీరానికి మరింత బలం కావాలంటే పండ్లతో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడానికి కనపడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్) లాంటివి తీసుకుంటుంటాం. కానీ ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర ఎక్కువగా fruits;french fries;mirchi;pistachio;vitamin;aqua;cholesterol;tuberculosis;neem;almonds;indian gooseberry;shaktiఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహరం తీసుకోవాలి...?ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహరం తీసుకోవాలి...?fruits;french fries;mirchi;pistachio;vitamin;aqua;cholesterol;tuberculosis;neem;almonds;indian gooseberry;shaktiSun, 04 Apr 2021 06:00:00 GMT

ముఖ్యంగా రోజూ సాయంత్రం వేళలో మనకు ఆకలివేసిన సమయంలో స్నాక్స్ కావాలని భావించినప్పుడు ఏదో ఒక పండును తింటుంటాం. ఇది మంచి పద్ధతే. కానీ పండుతో మన ఆకలి తీరదు. దీంతో చిప్స్, బిస్కెట్లు, కేకులు మిర్చి బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు లాంటివి ఏవేవో తింటుంటాం. వీటి బదులు పండుతో పాటు బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా పెరుగుతో చేసిన పదార్థాలు లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తిని ఇస్తాయి. ఉదాహరణకు ఒక యాపిల్ పండుతో పాటు కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకుంటే ఆకలితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.


శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని పలువురు వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.



పండ్లతో పాటు మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. శాకాహారం తినేవారిలో బీ12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటే రకరకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. మొలకెత్తిన గింజలు తినలేని వారు గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకోవచ్చు.శరీరానికి శక్తి కావాలంటే నిర్దిష్ట మొత్తంలో ఆహారం తీసుకోవాలి. అంటే కేలరీలు ఉండే ఆహారాన్ని తినాలన్నమాట.


అయితే అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనే అంశంపై చాలామంది స్పష్టత ఉండదు. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్న వారు ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్న వారు తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవన విధానం ఆధారంగా సాధారణ బరువు ఉండే వారికి ప్రతిరోజు 1600 నుంచి 1800 కేలరీలు ఉండే ఆహారం అవసరమవుతుంది. ప్రతిరోజు తాజాపండ్లతో పాటు డ్రైఫ్రూట్స్, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్, ప్రొటీన్‌లతో పాటు మంచి కేలరీలు అందుతాయి.ఒకవేళ కేలరీలు తగ్గించుకోవాలంటే ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం మానేయాలి. ఇలాంటి వాళ్లు పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్, కూల్‌డ్రింకులు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు.


 చిన్నపిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అసవరం కాబట్టి వారి ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉండాలి. అంటే వాళ్లు పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనిని బట్టి కూడా కేలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువగా పనిచేసే వారు ప్రతిరోజు 2,200 కేలరీల ఆహారం తీసుకోవచ్చు.కాగా శరీరానికి సరిపడా శక్తి కావాలంటే తినే భోజనంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు సమపాళ్లలో ఉండేలా చేసుకోవాలి. అయితే వీటిని కొలుచుకుని, చూసుకుని తినాల్సిన పని లేదు. మనం రోజూ తినే అన్నం, చపాతీలను ఏదో ఒక పప్పుతో కలిపి తీసుకుంటే చాలు. పిండి పదార్థాలకు ప్రొటీన్‌ను జత చేసుకున్నట్లే.


సమంత అక్కినేని గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు....?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>