MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-baluae789d35-ea5e-4033-b35f-b095d5d2e75a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sp-baluae789d35-ea5e-4033-b35f-b095d5d2e75a-415x250-IndiaHerald.jpgచిత్ర సీమ అంటే విచిత్ర సీమగా కూడా చెప్పాలి. ఇక్కడ ఎవరి జాతకాలు వారి చేతుల్లో ఉండవు, మరొకరు వాటిని రాస్తూంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా లక్ లేకపోతే వెనక్కి వెళ్ళిన వారి కధలూ ఇదే టాలీవుడ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే అపుడే ఇండస్ట్రీలోకి ప్రవేశించి చాలా వేగంగా ముందుకు వస్తున్న ఎస్పీ బాలు కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లాంటి ఘటన ఒకటి జరిగిందని చెప్పుకుంటారు. sp balu;health;ghantasala;tollywood;cinema;rayalaseemaఘంటసాల నో అనడంతో..బాలూ కెరీర్ కి అదే టర్నింగ్ పాయింట్...?ఘంటసాల నో అనడంతో..బాలూ కెరీర్ కి అదే టర్నింగ్ పాయింట్...?sp balu;health;ghantasala;tollywood;cinema;rayalaseemaSun, 04 Apr 2021 19:30:00 GMTచిత్ర సీమ అంటే విచిత్ర సీమగా కూడా చెప్పాలి. ఇక్కడ ఎవరి జాతకాలు వారి చేతుల్లో ఉండవు, మరొకరు వాటిని రాస్తూంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా లక్ లేకపోతే వెనక్కి వెళ్ళిన వారి కధలూ ఇదే టాలీవుడ్ లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే అపుడే ఇండస్ట్రీలోకి ప్రవేశించి చాలా వేగంగా ముందుకు వస్తున్న ఎస్పీ బాలు కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లాంటి ఘటన ఒకటి జరిగిందని చెప్పుకుంటారు. అదేంటంటే అప్పట్లో కె విశ్వనాధ్ ఎక్కువగా మహిళా కధాంశాలను ఇతివృత్తాలుగా చేసుకుని సినిమాలు తీసేవారు. ఆ వరసలో వచ్చిందే 1970ల నాటి చెల్లెలి కాపురం. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా బాలూయే పాడారు. అయితే ఇందులో సినిమాకు ఆయువు పట్టు లాంటి సాంగ్. సినిమా క్లైమాక్స్ కు ముందు వచ్చే సాంగ్ ఒకటి ఉంది. అదే చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన అన్నది. ఆ పాటను పాడడానికి మొదట అనుకున్నది ఘంటసాల మాస్టార్ ని. ఆయన హెల్త్ అప్పట్లో బాగులేకపోవడంతో ట్రాక్ ని బాలు చేత పాడించేసి సినిమా షూటింగ్ చేసేశారుట. ఆ తరువాత ఘంటశాలతో మళ్ళీ ఆ పాటను పాడించాలని చిత్ర యూనిట్ ప్రయత్నం చేసిందిట.

అయితే బాలూ పాడిన పాటను విన్న ఘంటసాల కుర్రాడు చాలా బాగా పాడాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వాడు. నేను మళ్లీ ఆ పాటను పాడను, అతనికే ఆ క్రెడిట్ ఉండనీయండి అంటూ సున్నితంగా తిరస్కరించారుట. అలా ఘంటసాల ఇచ్చిన వరంగా ఆ పాట బాలూకు ఎప్పటికీ మిగిలిపోయిందని అంటారు. ఆ పాట పుట్టి ఇప్పటికి అయిదు పదులు దాటినా కూడా ఈ రోజుకీ అద్భుతంగానే ఉంటుంది. అందులో గుక్క తిప్పుకోకుండా బాలూ చివరి చరణంలో పాడిన తీరు కూడా ఎప్పటికీ ఆయనకు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాయి. మొత్తానికి బాలూ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఈ పాటను చెప్పుకోవాలి.






చీరకట్టుతో చింపేసిన హాట్ బ్యూటీ...?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>