MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna453b6bda-173a-4e55-b825-c7067f40cc03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna453b6bda-173a-4e55-b825-c7067f40cc03-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున ఇద్దరు హీరోలకి తండ్రి.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం కలిగిన సీనియర్ హీరో. కానీ ఆయన ప్రేక్షకుల పల్స్ పట్టుకోలేకపోతున్నారు. మెజారిటీ ఆడియన్స్ కి నచ్చే టాపిక్ ఎంచుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పడానికి వరుసగా వస్తున్న డిజాస్టర్ సినిమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ టాలీవుడ్ హీరోలు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ వంతు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కానీ నాగార్జున మాత్రం మన్మధుడు 2 వంటి దిక్కుమాలిన సినిమాలు చేస్తూ అక్కినేని అభnagarjuna;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;tollywood;cinema;sankranthi;nandamuri balakrishna;television;audience;hero;silver;success;nandamuri taraka rama rao;fatherఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..nagarjuna;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;tollywood;cinema;sankranthi;nandamuri balakrishna;television;audience;hero;silver;success;nandamuri taraka rama rao;fatherSun, 04 Apr 2021 13:30:00 GMTఅక్కినేని నాగార్జున ఇద్దరు హీరోలకి తండ్రి.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం కలిగిన సీనియర్ హీరో. కానీ ఆయన ప్రేక్షకుల పల్స్ పట్టుకోలేకపోతున్నారు. మెజారిటీ ఆడియన్స్ కి నచ్చే టాపిక్ ఎంచుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పడానికి వరుసగా వస్తున్న డిజాస్టర్ సినిమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ టాలీవుడ్ హీరోలు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ వంతు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కానీ నాగార్జున మాత్రం మన్మధుడు 2 వంటి దిక్కుమాలిన సినిమాలు చేస్తూ అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ మిగుల్చుతున్నారు.


ఇటీవల వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాలోని చూపించిన సన్నివేశాలు గతంలో ఎన్నో వెబ్ సిరీస్ లలో చూపించినవే. పేలుళ్లకు సంబంధించిన సన్నివేశాలను పలు సినిమాల్లో కూడా చూపించారు. వార్తా కథనాల్లో, టీవీ ఛానలల్లో వచ్చిన సంఘటనలనే మళ్లీ నాగార్జున వెండి తెరకెక్కించారు. దీంతో కొత్తదనం ఏమీ లేదని.. సినిమా చాలా బోరింగ్ గా కొనసాగిందనే టాక్ వ్యాప్తిచెందింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఫలితంగా నాగార్జున పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారాయి.


నందమూరి బాలకృష్ణ కి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ప్రేక్షకుల పల్స్ పట్టుకోలేకపోతున్నారు. నేటి తరం ప్రేక్షకులు ఎటువంటి సినిమాలను బాగా ఆదరిస్తున్నారనే విషయం తెలియక ఆయన కూడా డిజాస్టర్ సినిమాలు చవిచూస్తున్నారు. గతంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు బయోపిక్ చేశారు కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. దీనికి ముఖ్య కారణం సినిమాని రసవత్తరంగా మలచకపోవడమేనని చెప్పుకోవచ్చు. తాజాగా నాగార్జున కూడా తన తండ్రి పై ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ విషయమై నాగార్జున వైల్డ్ డాగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తన తండ్రి బయోపిక్ పై స్పందించారు. బయోపిక్ చేయాలని తనకు ఉందని కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పర్ఫెక్ట్ గా సినిమా తీస్తేనే అది హిట్ అవుతుందని ఆయన అన్నారు. అయితే నాగార్జున చాలా జాగ్రత్తగా సినిమా చేస్తానని చెబుతుండటంతో ఆయన ఏఎన్ఆర్ బయోపిక్ విషయంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ బాలకృష్ణ లాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక గొప్ప యాక్టర్ బయోపిక్ తీస్తే.. అది డిజాస్టర్ కావడం ఖాయం. మరి నాగార్జున కనీసం తన తండ్రి బయోపిక్ తో నేను హిట్ కొడతారో లేదో చెయ్యాల్సింది. ఇదిలా ఉండగా బంగార్రాజు సినిమా తో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. 



తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

చంద్రబాబుని తిట్టడం మానేసిన బీజేపీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>