HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/teanieage-eating-egg-akkukuralu-milk51f9b18c-00b5-446e-ac35-6fa670099bfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/teanieage-eating-egg-akkukuralu-milk51f9b18c-00b5-446e-ac35-6fa670099bfc-415x250-IndiaHerald.jpgసాధారణంగా యుక్త వయసు వచ్చినప్పుడు ప్రభావవంతమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మనిషి పెరుగుదల, తెలివితేటలు అన్ని పెంపొందుతాయి. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరైనా సరే రోజు అన్ని పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్దలు వారి శరీర అవసరాలకు తగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.. కానీ యుక్తవయస్సులో ఉన్నవారు మాత్రం ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ వయసులో పోషకాలు అధికంగా అవసరమవుతాయి. కనుక తల్లిదండ్రులు వారికి అధికTEANIEAGE,EATING,EGG,AKKUKURALU,MILK;vitamin c;vitamin a;vitamin;beans;spinach;manam;shaktiఈ ఆహారాలను తరచూ తీసుకుంటే , టీనేజర్ లలో ఎదుగుదల సరిగ్గా ఉంటుందట..!ఈ ఆహారాలను తరచూ తీసుకుంటే , టీనేజర్ లలో ఎదుగుదల సరిగ్గా ఉంటుందట..!TEANIEAGE,EATING,EGG,AKKUKURALU,MILK;vitamin c;vitamin a;vitamin;beans;spinach;manam;shaktiSun, 04 Apr 2021 10:30:00 GMT
సాధారణంగా యుక్త వయసు వచ్చినప్పుడు ప్రభావవంతమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మనిషి పెరుగుదల, తెలివితేటలు అన్ని పెంపొందుతాయి. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే,  ఎవరైనా సరే రోజు అన్ని పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు,  పెద్దలు వారి శరీర అవసరాలకు తగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం  ఎంతో అవసరం.. కానీ యుక్తవయస్సులో ఉన్నవారు మాత్రం ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ వయసులో పోషకాలు అధికంగా అవసరమవుతాయి. కనుక తల్లిదండ్రులు వారికి అధిక పోషకాలు కలిగిన ఆహారాలను అందించాలి.. అయితే ఆ పోషకాలు ఏవో ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం..


1. చిలగడ దుంపలు :
చిలకడ దుంపల లో ఎన్నో పోషకాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా బీటాకెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో మొదటి పాత్ర వహిస్తాయి. కాబట్టి యుక్తవయసులో ఉన్నవారు ప్రతిరోజు చిలగడదుంపలు తీసుకోవడం వల్ల  అనేక ప్రయోజనాలు సమకూరుతాయి.


2.పాలు :
పాలలో క్యాల్షియం, మెగ్నీషియం,పాస్పరస్, ప్రోటీన్లు, విటమిన్ బి12 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి టీనేజ్ వయసులో ఉన్నవారి పెరుగుదలకు దోహదపడతాయి. ఈ వయసులో ఉన్న వారి ఎముకలు దృఢంగా మారేలా,  ఈ పాలు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా పాలతో పాటు సోయా బీన్స్ కూడా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన రోజువారి కాల్షియం బాగా అందుతుంది..


3. కోడి గుడ్లు :
కోడిగుడ్లలో ప్రోటీన్లు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉండే పిల్లల ఎదుగుదలకు అవసరమైన జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, సెలీనియం లభిస్తాయి. కాబట్టి రోజూ ఉదయాన్నే ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల పోషణ లభిస్తుంది.


4. ఆకుకూరలు :
సాధారణంగా టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువశాతం జంక్ ఫుడ్ ను ఇష్టపడతారు. కాయగూరలు,ఆకుకూరలు తినడానికి ఇష్టం ఉండదు. అయితే ఖచ్చితంగా వీటిని తినాలి. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఈ కాయగూరల్లో ఉంటాయి. అందులో ముఖ్య బ్రోకలీ, పాలకూర,పచ్చి బఠాణీలు, బీన్స్ వంటి కాయగూరలు తీసుకోవాలి. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అంది, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.


ఇక వీటితో పాటు అరటి పండ్లు, చేపలు, నట్స్ వంటివి రోజు తీసుకుంటూ ఉండాలి.





పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

చంద్రబాబుని తిట్టడం మానేసిన బీజేపీ

నాకెందుకు ప్ర‌పోజ్ చేయ‌లేదురా అంటున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

కేసీఆర్ అన్న ఆ మాటలకు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలట..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>