PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-ap-zptc-mptc-elections-2021fedc5200-55ff-49eb-ad20-0e9a969fc2ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-ap-zptc-mptc-elections-2021fedc5200-55ff-49eb-ad20-0e9a969fc2ce-415x250-IndiaHerald.jpgస్థానిక ఎన్నికలలో వాలంటీర్లతో అధికార వైసీపీ లబ్ధి పొందిందనేది ప్రతిపక్షాల విమర్శ. వాలంటీర్లను అడ్డు పెట్టుకుని, ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ప్రచారం చేయించి, ప్రజల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, వారి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవాలన్న గత ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు అమలయ్యాయి కూడా. మరి ఈ దఫా కూడా వాలంటీర్లపై అలాంటి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయా? ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం పట్టించుకుంటుందా అనేది తేలాap-zptc-mptc-elections-2021;amala akkineni;kumaar;bharatiya janata party;janasena;media;twitter;tdp;local language;ycp;janasena partyపరిషత్ ఎన్నికలను వాలంటీర్లతో ప్రభావితం చేస్తారా..?పరిషత్ ఎన్నికలను వాలంటీర్లతో ప్రభావితం చేస్తారా..?ap-zptc-mptc-elections-2021;amala akkineni;kumaar;bharatiya janata party;janasena;media;twitter;tdp;local language;ycp;janasena partySun, 04 Apr 2021 08:00:00 GMTస్థానిక ఎన్నికలలో వాలంటీర్లతో అధికార వైసీపీ లబ్ధి పొందిందనేది ప్రతిపక్షాల విమర్శ. వాలంటీర్లను అడ్డు పెట్టుకుని, ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ప్రచారం చేయించి, ప్రజల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, వారి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవాలన్న గత ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు అమలయ్యాయి కూడా. మరి ఈ దఫా కూడా వాలంటీర్లపై అలాంటి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయా? ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం పట్టించుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.

వాలంటీర్ల కారణంగానే స్థానికి ఎన్నికల్లో వైసీపీ లాభపడిందనేది టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్త ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే పలు సాక్ష్యాధారాలను కూడా ప్రతిపక్షాలు బయటపెడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగినట్టు చెబుతున్న ఓ వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. వైసీపీ నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయాలని చెబుతున్నట్టు ఆ వీడియో ఉంది.

" style="height: 556px;">


వాలంటీర్లతో ఎన్నికలు ప్రభావితం అవుతాయి, కేవలం వాలంటీర్లు చెబితేనే ప్రజల మనసులు మారిపోతాయి, లేదా ప్రజలు భయపడి ఓట్లు వేస్తారు అంటే అది కేవలం అనుమానమే. కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. వారి ప్రోద్బలం ఉన్నా లేకపోయినా, వారి ప్రభావం అయితే ప్రజలపై బాగానే ఉంటుంది. ఎందుకంటే.. ప్రతి చిన్న విషయానికీ ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు వాలంటీర్లపై ఆధారపడుతున్నారు. వాలంటీర్ల సేవలు కూడా ఆ స్థాయిలో ప్రజాభిమానం చూరగొంటున్నాయి. ఈ దశలో వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే పెద్ద తప్పు జరిగిపోతుందని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. అందుకే గొడవ చేస్తున్నాయి.

ఈనెల 8న జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా పెడుతున్నట్టు.. ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ఆదేశాలు  వెలువడలేదు. గత ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను పూర్తిగా దూరంగా పెట్టారు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరి ఈ దఫా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.


విజ‌య‌సాయిపై సీబీఐ ఎటాక్‌... సోషల్ మీడియాలో మాజీ మంత్రి సంచ‌ల‌నం

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?

చంద్రబాబు, లోకేశ్ మధ్య ఫిట్టింగ్ పెడుతున్న వైసీపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>