PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawanac5548f3-7029-49ce-996d-848e6d4540e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawanac5548f3-7029-49ce-996d-848e6d4540e0-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ కి విపరీత‌మైన సినీ గ్లామర్ ఉంది. అది ఏ స్థాయిలో ఉందో వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చెప్పేసింది. ఇంతటి ప్రజాదరణ ఉన్న పవన్ రాజకీయ తెర పైన కూడా రాణించాలనుకుంటున్నాడు. ఆయన గతంలో రాజకీయంగా కొన్ని తప్పులు చేశాడు. pawan;pawan;kalyan;rani;tiru;bharatiya janata party;jagan;cinema;tirupati;chief minister;y s vivekananda reddy;minister;husband;army;murder.;tdp;ycpపవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?pawan;pawan;kalyan;rani;tiru;bharatiya janata party;jagan;cinema;tirupati;chief minister;y s vivekananda reddy;minister;husband;army;murder.;tdp;ycpSun, 04 Apr 2021 10:30:00 GMTపవన్ కళ్యాణ్ కి విపరీత‌మైన సినీ గ్లామర్ ఉంది. అది ఏ స్థాయిలో ఉందో వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చెప్పేసింది. ఇంతటి ప్రజాదరణ ఉన్న పవన్ రాజకీయ తెర పైన కూడా రాణించాలనుకుంటున్నాడు. ఆయన గతంలో రాజకీయంగా కొన్ని తప్పులు చేశాడు.

కానీ ఇపుడు ఆ తప్పులు చేయదలచుకోలేదు అన్నది అర్ధమవుతోంది. పవన్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసారు. ఈ సందర్భంగా జన సమూహమే ఎటు చూసినా కనిపించింది. అసలు తిరుపతి ఉప ఎన్నిక మొదలయ్యాక‌ ఇంతటి జనాలకు ఎక్కడా చూసి ఎరగరు. అలాగే తొలి బహిరంగ సభ కూడా బీజేపీ సేన కూటమిదే కావడం విశేషం. ఇదిలా ఉంటే పవన్ తన ప్రసంగంలో ఎక్కడా టీడీపీ ప్రస్థావన తీసుకురాలేదు. అదే సమయంలో జగన్ సర్కార్ ని ఏకి పారేశారు. జగన్ కుటుంబ గొడవలను కూడా బయటకు తెచ్చారు. జగన్ చెల్లెలు సునీత ముఖ్యమంత్రి మీద చేసిన ఆరోపణలు కూడా ఆయన ప్రస్థావించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరో జగన్ కి తెలుసు అంటూ సూటిగానే టార్గెట్ చేశారు.

వైసీపీది గూండారాజ్యమని కూడా ఆయన నిందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీ రుబాబు చేస్తే తాను అసలు భయపడేది లేదని కూడా పవన్ కచ్చితంగా చెప్పేశారు. మొత్తానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గానే వైసీపీని అటాక్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత జగన్ మీద ఈ రేంజిలో అటాక్ చేసిన ప్రతిపక్షం ఇప్పటిదాకా లేదనే చెప్పాలి.  అదే సమయంలో బీజేపీ తనను కాబోయే సీఎం అని చెప్పడాన్ని కూడా పవన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు.  తనను జనాలు అభిమాన నటుడిగా చేసుకుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, దాని కంటే తనకు పెద్ద పదవులు ఉంటాయా అంటూ పవన్ చెప్పడాన్ని చూస్తే ఆయనకు ఎవరూ ఏ రకమైన బిస్కట్లు వేయలేరని  పవన్ చెప్పినట్టుగానే అర్ధమవుతోంది. ఇక సీఎం సీటు కనుక తనకు దక్కితే ఇంతకు పదింతలు మంచి పనులు చేసి చూపిస్తాను అని కూడా పవన్ అంటున్నారు. మొత్తానికి తాను సీఎం పదవికి అర్హుడినే అని చెబుతూనే  తనను ఎవరూ ఆ పేరు చెప్పి టెంప్ట్ చేయలేరని కూడా పవన్ చెప్పకనే చెప్పినట్లు అయింది.





తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

చంద్రబాబుని తిట్టడం మానేసిన బీజేపీ

నాకెందుకు ప్ర‌పోజ్ చేయ‌లేదురా అంటున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

కేసీఆర్ అన్న ఆ మాటలకు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలట..?

సామజవరగమన ను తిరస్కరించిన పవన్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>