PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehicles-petrol-tank-full-tank-summer-59ff02c0-f86a-4347-a32c-898ec0b9ce9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehicles-petrol-tank-full-tank-summer-59ff02c0-f86a-4347-a32c-898ec0b9ce9a-415x250-IndiaHerald.jpgరాను రాను ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు బయపడి ఎవరికి వారు ఇళ్లలోనే ఉంటున్నారు.మండుతున్న ఈ ఎండలకు వాహనాలలో ఇంధనం సైతం ఆవిరైపోతోంది. రాను రాను ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్‌ చేసిన ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది. ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒక పక్క పెట్రోలు ధరలు మండిపోతుంటే మళ్ళీ బైక్ లో పూయించిన ఇంధనం కూడా ఆవిరై పోతుంటే సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందనే చెప్పాలి. నిపుణుల అంచనా ప్రకారం ప్రతిరvehicles, petrol tank, full tank, summer,;surya sivakumar;pithe;car;bike;petrol;diesel;oilఈ సమ్మర్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించే వారికి షాకింగ్ న్యూస్.. !!ఈ సమ్మర్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించే వారికి షాకింగ్ న్యూస్.. !!vehicles, petrol tank, full tank, summer,;surya sivakumar;pithe;car;bike;petrol;diesel;oilSun, 04 Apr 2021 17:30:00 GMTఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒక పక్క పెట్రోలు ధరలు మండిపోతుంటే మళ్ళీ బైక్ లో పూయించిన ఇంధనం కూడా ఆవిరై పోతుంటే సామాన్యులపై ఆర్థిక భారం పడుతుందనే చెప్పాలి. నిపుణుల అంచనా ప్రకారం  ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్‌ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు  అంచనా వేస్తున్నారు.


సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్‌ల నుంచి మంటలు చెలరేగుతాయి.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తూ ఉన్నాము. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్‌ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది.


అందుకనే ఈ ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో  వాహన దారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ట్యాంక్ నిండా పెట్రోల్ నింపరాదు.అలాగే మీ వాహనాలను నీడలోనే పార్కింగ్‌ చేసుకోండి. కేవలం ఇంజన్‌కు సరిపడా మాత్రమే ఆయిల్‌ ఉండేట్లు చూసుకోండి . ఎండల వేడికి ఇంజన్‌ ఆయిల్‌ త్వరగా పల్చబడిపోతుంది. వేసవిలో ఇంజిన్‌ గార్డు లు తొలగించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి కొద్దిసేపు ఇంజిన్ కి  విశ్రాంతి నివ్వాలి.అలాగే వాహనం యొక్క  పెట్రోల్‌ ట్యాంకుపై దళసరి కవర్‌ ఉండేటట్లు చూడాలి.






తెలంగాణలో వై ఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ..?

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ

చరణ్ - శంకర్ సినిమాలో చిరంజీవి ?

ఆ విషయం లో బాలకృష్ణ అట్టర్ ప్లాప్ కానీ నాగార్జున సక్సెస్ అవుతారా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>