MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-industry-corona-effecta91d343f-3b8e-49d6-81a0-2a2162735d64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-industry-corona-effecta91d343f-3b8e-49d6-81a0-2a2162735d64-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మళ్లీ పరిస్థితి మొదటికొస్తోందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు మరింత భయపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమపై కరోనా తన ప్రభావాన్ని పెంచిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లకు బ్రేక్ వేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. TOLLYWOOD-INDUSTRY-CORONA-EFFECT;allu aravind;prasad;srinivas;trivikram srinivas;vivek;tollywood;cinema;media;producer;industry;director;producer1;nivetha thomas;coronavirusటాలీవుడ్ లో మళ్ళీ కరోనా కలకలం...!టాలీవుడ్ లో మళ్ళీ కరోనా కలకలం...!TOLLYWOOD-INDUSTRY-CORONA-EFFECT;allu aravind;prasad;srinivas;trivikram srinivas;vivek;tollywood;cinema;media;producer;industry;director;producer1;nivetha thomas;coronavirusSun, 04 Apr 2021 12:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మళ్లీ పరిస్థితి మొదటికొస్తోందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు మరింత భయపెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమపై కరోనా తన ప్రభావాన్ని పెంచిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లకు బ్రేక్ వేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దాని ప్రభావం పెద్దగా లేదన్న కథనాలు వినపడుతున్నాయి. ఇప్పటికే కరోనా వాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్న వ్యక్తులు సైతం కరోనా బారిన పడుతున్నారని సమాచారం. దీంతో వ్యాక్సిన్ సైతం కరోనా పై ఎంత మాత్రం ప్రభావం చూపలేక పోతుందన్న వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

మరోవైపు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారన్న న్యూస్ మరింత భీతిని కలిగిస్తోంది. తాజాగా ప్రముఖ కథానాయిక నివేదా థామస్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా నివేదా ఇటీవల   'వకీల్ సాబ్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే  అక్కడ ఎవరి నుంచైనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారట. ఇంకోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు కొన్ని మీడియాలలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. అయినప్పటికీ  ఆయనకు కరోనా సోకినట్లు టాక్.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ గా వచ్చింది...మళ్లీ కొద్ది రోజులుగా మళ్ళీ టెస్ట్ చేయగా నెగెటివ్ గా తేలిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్ - వివేక్ కూచిబొట్ల వంటి  వారికీ కూడా కరోనా సోకడంతో చికిత్స తీసుకొని త్వరగానే కోలుకున్నారని సమాచారం.. ఇంతేకాక మరికొందరు సెలబ్రిటీలకు కూడా కరోనా నిర్దారణ అయినట్లు వినికిడి. ఇలా టాలీవుడ్ మొత్తం కరోనా వైరస్ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ కరోనా వ్యాప్తి ఎంతవరకు వెళుతుందో చూడాలి.



రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ అట్టర్ ప్లాప్ సినిమా...

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>