PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcre26c06d5-0fbb-49c4-82fd-4608c8bb42a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-kcre26c06d5-0fbb-49c4-82fd-4608c8bb42a0-415x250-IndiaHerald.jpgకేసీఆర్ అన్న ఆ మాటలకు ఏపీ సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలట.. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరు.. అసలు కేసీఆర్ ఏం అన్నారు.. జగన్ ఎందుకు సిగ్గుతో తలదించుకోవాలి.. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏపీ, తెలంగాణ భూములను పోల్చి మాట్లాడారు.. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు ఎకరం అమ్ముకుని తెలంగాణలో మూడెకరాల భూమి కొనుక్కునేవారనీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిందనీ, తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రెండెకరాలుjagan-kcr;cbn;kcr;vidya;jagan;andhra pradesh;telangana;chief minister;aqua;vemuri radhakrishna;party;andhra jyothiకేసీఆర్ అన్న ఆ మాటలకు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలట..?కేసీఆర్ అన్న ఆ మాటలకు.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలట..?jagan-kcr;cbn;kcr;vidya;jagan;andhra pradesh;telangana;chief minister;aqua;vemuri radhakrishna;party;andhra jyothiSun, 04 Apr 2021 09:00:00 GMTకేసీఆర్ అన్న ఆ మాటలకు ఏపీ సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలట.. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరు.. అసలు కేసీఆర్ ఏం అన్నారు.. జగన్ ఎందుకు సిగ్గుతో తలదించుకోవాలి.. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏపీ, తెలంగాణ భూములను పోల్చి మాట్లాడారు.. ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు ఎకరం అమ్ముకుని తెలంగాణలో మూడెకరాల భూమి కొనుక్కునేవారనీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిందనీ, తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రెండెకరాలు కొనుక్కోగలిగేలా పరిస్థితి మారిందని కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారు.

ఇప్పుడు ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రస్తావించారు. కేసీఆర్ మాటలను కూడా రాధాకృష్ణ చంద్రబాబుకు అనుకూలంగా అన్వయిస్తూ కథనం రాశారు. కేసీఆర్ చెప్పిన దాంట్లో పెద్దగా అతిశయోక్తి ఏమీ లేదని... 60, 70 ఏళ్ల క్రితం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వేలాదిమంది తమకున్న కొద్దిపాటి భూమిని అమ్ముకుని తెలంగాణకు వలస వచ్చి వ్యవసాయ భూములు కొనుక్కుని ఆర్థికంగా స్థిరపడ్డారని... ధరల్లో కొంత తేడా ఉన్నప్పటికీ నిన్నమొన్నటి వరకు ఇదే పరిస్థితి ఉండేదని... ఇప్పుడు కేసీఆర్‌ అన్నట్టుగానే సీన్‌ రివర్స్‌ అయిందని రాధాకృష్ణ అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విద్యుత్‌ కొరత లేకుండా చేశారని... దీంతో తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం భూమి ధర పాతిక లక్షల రూపాయలకు తక్కువ లేదని... రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అమరావతిలో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపారని... ఫలితంగా హైదరాబాద్‌లో భూముల ధరల పెరుగుదల మందగించిందని రాధాకృష్ణ రాసుకొచ్చారు.

అయితే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని చంపేయాలనుకోవడంతో హైదరాబాద్‌కు మళ్లీ మహర్దశ పట్టుకుందట. అదే సమయంలో సాగునీటి వసతి పెరగడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భూముల ధరలు పెరిగిపోయాయట. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారట. ఆయనన్న మాటలకు ఆంధ్ర ప్రజలు నొచ్చుకోనవసరం లేదు గానీ, అధికారంలో ఉన్నవాళ్లు సిగ్గుతో తల దించుకోవాలంటున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.

అంతే కాదు.. గత ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ముఖ్యులతో మాట్లాడుతూ, ఆంధ్రాలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టెట్‌ రంగం దెబ్బతినే ప్రమాదముందని అన్నారట. జగన్‌రెడ్డి అధికారంలోకి రావడం తమకు మంచిదని వ్యాఖ్యానించారట.. ఆయన ఊహించినట్టుగానే జరిగిందని....జరుగుతున్నదని అంటున్నారు రాధాకృష్ణ.



ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>