CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karnataka-drugs9a04d03a-35a8-4443-a0f8-d7b26781b984-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karnataka-drugs9a04d03a-35a8-4443-a0f8-d7b26781b984-415x250-IndiaHerald.jpgకర్ణాటక లో డ్రగ్స్ కేసులో రోజుకో పేరు బయటకు వస్తుంది.ఈ కేసు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. శాసనసభ్యులతోపాటు మరికొందరు ప్రముఖులకూ సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా ఈ మత్తులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు సమాచారం.హైదరాబాద్‌ బంధానికి కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి అలియాస్‌ రతన్‌ నల్లాలు కీలకంగా మారారు. వారిని విచారిస్తే అందరి బండారం బయటపడుతుందని భావిస్తున్న పోలీసులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు.Karnataka drugs;bandara;karnataka - bengaluru;telangana;hosta;police;bengaluru 1;producer;kannada;arrest;producer1;drugs;reddyకర్ణాటకలో ఉత్కంఠ... మత్తులో చాలా మంది..!కర్ణాటకలో ఉత్కంఠ... మత్తులో చాలా మంది..!Karnataka drugs;bandara;karnataka - bengaluru;telangana;hosta;police;bengaluru 1;producer;kannada;arrest;producer1;drugs;reddySun, 04 Apr 2021 09:00:00 GMTకర్ణాటక లో డ్రగ్స్ కేసులో రోజుకో పేరు బయటకు వస్తుంది.ఈ కేసు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. శాసనసభ్యులతోపాటు మరికొందరు ప్రముఖులకూ సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా ఈ మత్తులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ బంధానికి కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డి అలియాస్‌ రతన్‌ నల్లాలు కీలకంగా మారారు. వారిని విచారిస్తే అందరి బండారం బయటపడుతుందని భావిస్తున్న పోలీసులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు.


కన్నడ సినీ నిర్మాత శంకరగౌడను విచారించినప్పుడు రతన్‌రెడ్డి అలియాస్‌ రతన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో జరిగే పార్టీల్లో తనను తాను ఉద్యమకారుడి గా చెప్పుకొనేవాడని, దాంతో బెంగళూరు పోలీసులు తమ రికార్డుల్లో కూడా ఉద్యమకారుడు రతన్‌రెడ్డి గానే పేర్కొన్నట్లు తెలుస్తోంది. శంకర్‌గౌడ కుమార్తె పుట్టిన రోజు పార్టీలో హైదరాబాద్‌ వ్యాపారి సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యేతో పాటు శ్రీనురెడ్డి అనే మరో వ్యక్తీ పాల్గొన్నాడు. అక్కడ మత్తు పదార్థాలను వినియోగించినట్టు తెలుస్తుంది.


బెంగళూరు లో ఓ నటుడికి చెందిన హోటల్‌లో జరిగే మత్తు పార్టీలకు ప్రముఖులు హాజరైన సీసీ కెమెరాల ఫుటేజీని ఇప్పటికే బెంగళూరు పోలీసులు సేకరించారు. ఇందులో హైదరాబాద్‌ ప్రముఖులకు సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ పార్టీల్లో పాల్గొన్న వారు తమ సెల్‌ఫోన్లలో తీసుకున్న ఫొటోలను కూడా పోలీసులు సేకరించారు. విశాఖలో కూడా మత్తు పదార్థాలు లభ్యం అయ్యాయి. నౌకల ద్వారా విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులో మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది..ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఈ కేసులో చాలా మంది పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు



ఒక్క రోజే 500 మరణాలు.. దేశంలో కరోనా విలయం

క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా భ‌యం... 1-8 వ త‌ర‌గ‌తి విద్యార్థులు పాస్

ష‌ర్మిల‌పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలయ్య సినిమాలో మంచు మనోజ్ మరోసారి..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్ లకు కరోనా.. వారిద్దరేనా ?

పవనే సీఎం, పవనూ సీఎం, పవనా సీఎం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>