MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi12dafd3f-5964-476c-820e-3c2edbd20994-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi12dafd3f-5964-476c-820e-3c2edbd20994-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో సాయి పల్లవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోని సినిమాల్లో కూడా సాయిపల్లవికి నటిగా మంచి పేరు, గుర్తింపు ఉంది. ఆ పేరు, గుర్తింపే ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల పాలిట వరమవుతోంది. సాయిపల్లవికి బహుభాషానటిగా గుర్తింపు ఉండటంతో ఆమె సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.sai pallavi;view;naga chaitanya;sekhar;kamma;tollywood;cinema;telugu;tamil;kannada;love;blockbuster hit;heroine;sai pallavi;love story;fidaaనిర్మాతల పాలిట వరమవుతున్న ఆ హీరోయిన్ ఎందుకంటే..!నిర్మాతల పాలిట వరమవుతున్న ఆ హీరోయిన్ ఎందుకంటే..!sai pallavi;view;naga chaitanya;sekhar;kamma;tollywood;cinema;telugu;tamil;kannada;love;blockbuster hit;heroine;sai pallavi;love story;fidaaSun, 04 Apr 2021 06:46:32 GMTచిత్ర పరిశ్రమలో సాయి పల్లవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోని సినిమాల్లో కూడా సాయిపల్లవికి నటిగా మంచి పేరు, గుర్తింపు ఉంది. ఆ పేరు, గుర్తింపే ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతల పాలిట వరమవుతోంది. సాయిపల్లవికి బహుభాషానటిగా గుర్తింపు ఉండటంతో ఆమె సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. లవ్ స్టోరీ సినిమా తెలుగులో ఈ నెల 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకనిర్మాతలు కన్నడ, మలయాళ భాషల్లో కూడా లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక నాగచైతన్యకు తెలుగులో క్రేజ్ బాగానే ఉన్నా ఇతర భాషల్లో పెద్దగా గుర్తింపు లేదు. అయితే సాయిపల్లవికి మాత్రం ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉండటం నిర్మాతల పాలిట వరమవుతోంది. లవ్ స్టోరీ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఉండటం కూడా ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి కారణమవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు సైతం సారంగదరియా పాట ఎంతగానో నచ్చేసింది. ఈ భాష ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్టైన సారంగదరియా పాట 10 కోట్ల వ్యూస్ ను అందుకోవడం గమనార్హం.

అయితే తమిళంలో కూడా సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో హిట్టైతే లవ్ స్టోరీ సినిమా తమిళంలో కూడా రిలీజయ్యే అవకాశం ఉంటుంది. ఫిదా తరువాత కొత్తవాళ్లతో లవ్ స్టోరీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నాగచైతన్య, సాయిపల్లవిలను తీసుకొని రీషూట్ చేశారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలను అందించడం గమనార్హం.



నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి

పవన్ విషయంలో బాబుపై వామపక్షాల ఒత్తిడి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>