PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mptc-and-zptc-elections-202133667d10-47c9-4d6e-beac-f5ef64a8707b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mptc-and-zptc-elections-202133667d10-47c9-4d6e-beac-f5ef64a8707b-415x250-IndiaHerald.jpgఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచి ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు టీడీపీతో సహ ఇతర పార్టీలు ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ నీలం సాహ్ని మాత్రం పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు.mptc and zptc elections 2021;cbn;jagan;janasena;congress;government;tdp;ycp;election commission;janasena partyఅప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ..తేడా కొడుతుందే?అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ..తేడా కొడుతుందే?mptc and zptc elections 2021;cbn;jagan;janasena;congress;government;tdp;ycp;election commission;janasena partySat, 03 Apr 2021 02:00:00 GMT

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచి ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు టీడీపీతో సహ ఇతర పార్టీలు ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ నీలం సాహ్ని మాత్రం పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు.


కాకపోతే అఖిలపక్ష సమావేశం కంటే ముందే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీలు డుమ్మా కొట్టాయి. అటు కాంగ్రెస్ సైతం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టిన అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాలు దాదాపు డుమ్మా కొట్టేశాయి. అయితే గతంలో నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నప్పుడు, వైసీపీ ఇలాగే అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరైంది.


కానీ టీడీపీ, జనసేన, బీజేపీలు మాత్రం హాజరయ్యేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాకపోతే నిమ్మగడ్డ పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసేది. నిమ్మగడ్డ, చంద్రబాబులపై వైసీపీ నేతలు ప్రతిరోజూ విరుచుకుపడేవారు. అయితే తాజాగా నిమ్మగడ్డ రిటైర్ అయిపోయారు. ఇక ఆయన స్థానంలో నీలం సాహ్ని ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.


నీలం సాహ్ని గతంలో జగన్ ప్రభుత్వంలో సి‌ఎస్ గా పనిచేశారు. అలాగే మొన్నటివరకు సలహాదారుగా పనిచేశారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. దీంతో టీడీపీ రివర్స్ అయింది. నీలం సాహ్ని, జగన్ మనిషి అని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి న్యాయం జరగదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. గతంలోనే తమ అభ్యర్ధులని నానా ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు మరింత ఇబ్బంది పెట్టొచ్చని అందుకనే ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతోనే టీడీపీ వెనక్కి తగ్గుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికైతే టీడీపీ ఎన్నికలని బహిష్కరించడం ఒక సంచలన నిర్ణయమే.





తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>