SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sam-manekshaw698b54bf-4680-4ae0-8bf3-b72a20a9a9eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sam-manekshaw698b54bf-4680-4ae0-8bf3-b72a20a9a9eb-415x250-IndiaHerald.jpgజాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008). సాహసోపేత భారత సైనికుడు అని చెప్పాలి. 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యారు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు.బ్రిటిష్‌ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిsam_manekshaw;view;apoorva;jeevitha rajaseskhar;shimla;bangladesh;war;army;hero;butter;june;santoshamహెరాల్డ్ స్మ‌రామీ : బంగ్లా ఆవిర్భావానికి భారతీయ సైనికుడి బ‌లం..హెరాల్డ్ స్మ‌రామీ : బంగ్లా ఆవిర్భావానికి భారతీయ సైనికుడి బ‌లం..sam_manekshaw;view;apoorva;jeevitha rajaseskhar;shimla;bangladesh;war;army;hero;butter;june;santoshamSat, 03 Apr 2021 06:30:00 GMTజాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008). సాహసోపేత భారత సైనికుడు అని చెప్పాలి. 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యారు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు.బ్రిటిష్‌ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం‌ మానెక్‌షా- రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి.
 

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్‌ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్‌'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్‌షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్‌ జనరల్‌ డి.టి.కోవన్‌, తన 'మిలిటరీ క్రాస్‌ రిబ్బన్‌'ను తక్షణం మానెక్‌షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్‌షా, మరోసారి బర్మాలో జపాన్‌ సైనికులను ఢీకొన్నారు.


మళ్ళీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్‌ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947-48లో జమ్ముకాశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్‌ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 45,000 మంది పాక్‌సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది.


ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది.న్యూమోనియాకు చికిత్స పొందుతూ, కొంత సహజమయిన వృద్దాప్యం వలన జూన్ 26, 2008 గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన యుద్ధ సేనాని జీవితంలో అలసిపోయి శాశ్వతంగా చుట్టూ ఉన్న కుటుంభ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారు. గొప్ప యోధుడిగానే 94 ఏళ్ల పరిపూర్ణ జీవనం సంతోషంగా గడిపారు.



ఏపీలో ఆ మూడు జిల్లాల్లో క‌రోనా ఉగ్ర‌రూపం

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>