MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkondaganesh-movie-updates492381fc-d7fc-401d-a99e-954e2c159e41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkondaganesh-movie-updates492381fc-d7fc-401d-a99e-954e2c159e41-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు శ్రీనివాస్. హిట్లు, ఫ్లాప్ లు అన్న విషయం పక్కన పెట్టి... వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు హీరో. సినిమా బ్యాగ్రౌండ్ ఉండి, టాలెంట్ మెండు గా ఉన్నా, తన కెరీర్ లో ఇంకా ఒక మంచి హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు.BELLAMKONDAGANESH-MOVIE-UPDATES;pawan;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;sithara;srinivas;bollywood;tollywood;cinema;telugu;jaggery;hero;yuva;chatrapathi;kavuru srinivasప్రముఖ సూపర్ హిట్ బ్యానర్లో బెల్లంకొండ మూవీ...?ప్రముఖ సూపర్ హిట్ బ్యానర్లో బెల్లంకొండ మూవీ...?BELLAMKONDAGANESH-MOVIE-UPDATES;pawan;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;sithara;srinivas;bollywood;tollywood;cinema;telugu;jaggery;hero;yuva;chatrapathi;kavuru srinivasSat, 03 Apr 2021 18:00:00 GMTటాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు శ్రీనివాస్. హిట్లు, ఫ్లాప్ లు అన్న విషయం పక్కన పెట్టి... వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు హీరో. సినిమా బ్యాగ్రౌండ్ ఉండి, టాలెంట్ మెండు గా ఉన్నా, తన కెరీర్ లో ఇంకా ఒక మంచి హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ యువ హీరో. కానీ నటన పరంగా డాన్స్ పరంగా మాత్రం ప్రేక్షకుల నుండి బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి ఆదరణ లభించింది.

 అయితే ప్రస్తుతం తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు బెల్లంకొండ. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో  శ్రీనివాస్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు..బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి గణేష్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవానికి ఇతని మొదటి సినిమా పవన్ సాధినేని దర్శకత్వంలో గత ఏడాదే ప్రారంభం అయింది. కానీ ఈ సినిమా వివిధ కారణాల వలన  మధ్య లోనే ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో క్లారిటీ లేదు... ఇలాంటి సందర్భంలో మొదటి సినిమా అలా ఉండగానే రెండవ సినిమాలో గణేష్ అవకాశాన్ని దక్కించుకున్నాడు .

సినిమా ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో ఓ సినిమా చేయబోతున్నారట గణేష్. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ యాక్టివ్ నిర్మాణ సంస్థగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కాబోతుంది అనే వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని టాక్. మరి అన్న శ్రీనివాస్ కొనసాగించలేని స్టార్ డం తమ్ముడు సాధిస్తాడా...? లేదా అన్నలాగే ఇతని కెరీర్ కూడా మందకొడిగా సాగుతుందా చూడాలి.



డీఎంకే గెలుపు కన్ఫర్మ్ చేసేశారా...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>