PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendercfd9f3dc-7c24-4b2e-8f5e-958acba2ceb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendercfd9f3dc-7c24-4b2e-8f5e-958acba2ceb7-415x250-IndiaHerald.jpgగ‌త‌కొంత కాలంగా మంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అధికార పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గులాబీ ఓన‌ర్ల‌మ‌ని, ఏ ప్ర‌భు‌త్వాలు శాశ్వ‌తం కాదంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌నే మొద‌లుపెట్టాయి. అటు సీఎం కేసీఆర్ కూడా ఈటెల‌ను దూరం పెడుతూ రావ‌టంతో వివాదం పెద్ద‌దైంది. ఆయ‌న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల కోసం పetela;kcr;amala akkineni;poorna;ramu;sampada;hyderabad;eatala rajendar;telangana;backward classes;mahabharatham;minister;etela rajenderఈటెల అస్స‌లు త‌గ్గ‌డం లేదు... మంత్రి రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం లేదంట‌ఈటెల అస్స‌లు త‌గ్గ‌డం లేదు... మంత్రి రాజ‌కీయాల గురించి మాట్లాడ‌టం లేదంట‌etela;kcr;amala akkineni;poorna;ramu;sampada;hyderabad;eatala rajendar;telangana;backward classes;mahabharatham;minister;etela rajenderSat, 03 Apr 2021 08:00:00 GMTమంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తున్నాడు.    అధికార  పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గులాబీ ఓన‌ర్ల‌మ‌ని, ఏ ప్ర‌భు‌త్వాలు శాశ్వ‌తం కాదంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌నే మొద‌లుపెట్టాయి. అటు సీఎం కేసీఆర్ కూడా ఈటెల‌ను దూరం పెడుతూ రావ‌టంతో వివాదం పెద్ద‌దైంది. ఆయ‌న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి.  హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడే వాళ్లం.. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలని సూచించారు.


భారత దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాలన్న ఈటల.. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ, అది సక్రమంగా అమలు కాలేదని.. అందుకే  క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నారు.. మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని.. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అన్నారు ఈటల రాజేందర్.  ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వస్తోంది, మనల్ని పాలించే వారికి మెరిట్ ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొనే మెరిట్ పాలకుల్లో ఉండాలన్నారు.


మనిషి సంఘజీవి.ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలి. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. దేశ పౌరునిగా,సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నము. కానీ అది సక్రమంగా అమలు కాలేదు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణం. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదు. గ‌తంలోనూ "మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది.. అలాగే రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు.. రావణుడు ఉన్నాడు.. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారం, అభరణాలు, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి." అంటూ న‌ర్మ‌గ‌ర్భం వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. 



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>