MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-shankar64b67433-5385-49ff-991f-114adf6e74fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-shankar64b67433-5385-49ff-991f-114adf6e74fd-415x250-IndiaHerald.jpgతమిళ డైరెక్టర్‌ శంకర్‌కు మద్రాస్ హై కోర్టులో ఊరట లభించింది. కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ -2 సినిమా నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ శంకర్‌పై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే మరో సినిమా చిత్రీకరించాలని తీర్పుని ఇచ్చింది. అయితే దీనిపై విచారణ చేసిన మద్రాస్‌ హై కోర్టు అది కుదరదని స్పష్టం చేసింది.Ram Charan Shankar;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;tara;cinema;tamil;court;chennai;indianరామ్ చరణ్ - శంకర్ మూవీకి లైన్ క్లియర్ అయ్యినట్టేనా..?రామ్ చరణ్ - శంకర్ మూవీకి లైన్ క్లియర్ అయ్యినట్టేనా..?Ram Charan Shankar;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;tara;cinema;tamil;court;chennai;indianSat, 03 Apr 2021 07:00:00 GMTతమిళ డైరెక్టర్‌ శంకర్‌కు మద్రాస్ హై కోర్టులో ఊరట లభించింది. కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ -2 సినిమా నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ శంకర్‌పై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే మరో సినిమా చిత్రీకరించాలని తీర్పుని ఇచ్చింది. అయితే దీనిపై విచారణ చేసిన మద్రాస్‌ హై కోర్టు అది కుదరదని స్పష్టం చేసింది.

అయితే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాను ప్రాథమికంగా రూ.236 కోట్ల బడ్జెట్ ‌తో ప్రారంభించామని తెలిపిన లైకా ప్రొడక్షన్స్.. ఇప్పటి వరకు రూ.180 కోట్లు ఖర్చు పెట్టినట్లు పిటిషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ.. 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. కానీ.. ఇప్పుడు సినిమా పూర్తి చేయకుండా.. మరో ప్రాజెక్టును చేపట్టారని కోర్టుకు తెలిపారు.

అంతేకాకుండా.. దర్శకుడు శంకర్ కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించడానికి నిర్మాతలు ఒప్పుకున్నారని ఇప్పటికే రూ.14 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించినట్లు కోర్టుకు తెలిపారు. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో మిగిలిన రూ.26 కోట్ల బకాయిని కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందువల్ల.. శంకర్ ఇండియన్-2 పూర్తి చేసే వరకూ భవిష్యత్ ప్రాజెక్టు కొనసాగించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. గతంలో శంకర్ ఇదే నిర్మాణంలో 2.0 సినిమా చేశాడు. అయితే ఇది దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో ఇండియన్ 2 సినిమాకు సగానికి సగం బడ్జెట్ కోత పెట్టారు నిర్మాతలు.

ఇక వాదనలు విన్న న్యాయస్థానం.. శంకర్ భవిష్యత్ ప్రాజెక్టుపై మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించారు. అయితే.. శంకర్ ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో శంకర్ కోర్టుకు ఎలాంటి సమాధానం చెబుతారు? కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. శంకర్ భవిష్యత్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రామ్ చరణ్ సినిమా అనుకున్న సమయానికే పట్టాలెక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>