PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదని, తక్షణం ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని, క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. అదే విధంగా గరిష్ట వయోపరిమితిని కూడా పెంచి భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలని ఆయన శనివారం డిమాండ్ చేశారు. సునీల్ నాయక్ మృతి అత్యంత బాధాకరం, విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్ర కలతకు గురిచేసిందని భట్టి అన్నారు. నిరుద్యోగ యువbhatti;kcr;sunil;congress;chief minister;assembly;thota chandrasekhar;qualification;mallu bhatti vikramarka;nayak;partyసునీల్ నాయక్ మరణంపై కాంగ్రెస్ పార్టీ ఉద్య‌మం... భ‌ట్టి ఏమ‌న్నారంటే..?!సునీల్ నాయక్ మరణంపై కాంగ్రెస్ పార్టీ ఉద్య‌మం... భ‌ట్టి ఏమ‌న్నారంటే..?!bhatti;kcr;sunil;congress;chief minister;assembly;thota chandrasekhar;qualification;mallu bhatti vikramarka;nayak;partySat, 03 Apr 2021 19:00:00 GMT రాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదని, తక్షణం ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని, క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. అదే విధంగా గరిష్ట వయోపరిమితిని కూడా పెంచి భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలని ఆయన శనివారం డిమాండ్ చేశారు. సునీల్ నాయక్ మృతి అత్యంత బాధాకరం, విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్ర కలతకు గురిచేసిందని భట్టి అన్నారు. నిరుద్యోగ యువత కూడా ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, పోరాడి అన్నిటినీ సాధించుకుందాం అని భట్టి విజ్ఞప్తి చేశారు.


 కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టంలో ఆత్మబలిదానాలు అత్యంత విచారకరమని,  ఈ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ స్థానంలో వున్నారంటే కారణం వందలాదిమంది ప్రాణాత్యాగాల ఫలితమన్నారు. అలాంటిది ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్న తరువాత కూడా గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణాలో  ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారని, ఉద్యోగ నియామకాలు యువత ఆశించినంతగా, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా  జరగడం లేదన్నారు. ఇటీవల పే రివిజన్ కమిషన్ కూడా రాష్ర్టంలో ఒక లక్ష్యా  91 ఉద్యోగాల ఖాళీలు వున్నాయని తన నివేదికలో పేర్కొందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు కేసీఆర్ చేబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదని,  తాజాగా జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా  ఇదే విషయమై ప్రశ్నించగా త్వరలోనే భర్తీ చేస్తామన్నారన్నారు.


అదే విధంగా చాలా కాలం నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు లేనందున సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువత వేచిచూస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్యం, అలసత్వం వల్ల ఉద్యోగాల భర్తీ లేనప్పుడు అందుకు నిరుద్యోగులను శిక్షించడం సరియైంది కాదన్నారు.  దరఖాస్తు సమయంలో గరిష్ట వయోపరిమితి పెంచాల్సిన అవసరం వుందన్నారు.  గరిష్ట వయోపరిమితిని పెంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తక్షణం చేపట్టాలని  భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే ఉద్యోగ, ఉపాధ్యాయ సహా అన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ళ నుండి 44 ఏళ్లకు పెంచాలని, ఎక్కువ మంది నిరుద్యోగలకు అవకాశం కల్పించేందుకు ,అర్హత సాధించేందుకు ఇది చాలా అవసరమని భట్టి విక్రమార్క ప్రకటనలో పేర్కొన్నారు.



శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ని మరో సాయి పల్లవిలా మారుస్తాడా?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>