PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-separation-issue8310a118-b99f-498a-a490-eb1f08893bcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-separation-issue8310a118-b99f-498a-a490-eb1f08893bcc-415x250-IndiaHerald.jpg2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఇరు రాష్ట్రాలకు ఆస్తులు మరియు ఇతర విషయాలపైన వివాదాలు రావడం చూశాము. అయితే వీటన్నింటినీ సమన్వయము చేసి అన్నింటినీ పంచి ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇవి కూడా ఇరు రాష్ట్రాలకు ఎటువంటి వివాదాలు జరుగకుండా చేయాల్సిన అవసరం ఉంది. STATE-SEPARATION-ISSUE;andhra pradesh;telangana;court;central government;houseరాష్ట్ర విభజన ఆస్తుల విషయంలో కేంద్రం కరుణిస్తుందా...?రాష్ట్ర విభజన ఆస్తుల విషయంలో కేంద్రం కరుణిస్తుందా...?STATE-SEPARATION-ISSUE;andhra pradesh;telangana;court;central government;houseSat, 03 Apr 2021 15:00:00 GMT2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఇరు రాష్ట్రాలకు ఆస్తులు మరియు ఇతర విషయాలపైన వివాదాలు రావడం చూశాము. అయితే వీటన్నింటినీ సమన్వయము చేసి అన్నింటినీ పంచి ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇవి కూడా ఇరు రాష్ట్రాలకు ఎటువంటి వివాదాలు జరుగకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే అప్పట్లోనే కీలకమైన మూడు సమావేశాలు జరగడం తెలిసి విషయమే. ఈ సమావేశాలలో ఇరు రాష్ట్రాల వారు ఎవరికి అనుకూలంగా వారు తమ వాదనలను వినిపించడం జరిగింది. సెక్షన్ 9 మరియు సెక్షన్ 10 కిందికి వచ్చే సంస్థలన్నీ కూడా రెండు రాష్ట్రాలకు జరగవలసిన ఆస్తుల విభజన విషయాలు ఇందులో ఉన్నాయి.

కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రము తమకు తాముగా ఏకపక్షంగా అక్కడ ఉన్న ఆస్తులన్నీ మావే అని జీ ఓ లు జారీ చేసి ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో అప్పటి అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ విషయంలో వాస్తవాలు ఏమి జరిగాయో చూసి పరిష్కరించాలని సుప్రీం కోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదే విధంగా హై కోర్ట్ కూడా ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని సూచించింది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం హోమ్ శాఖ ఇదంతా చూసుకోవాల్సి ఉండగా...హోమ్ శాఖ కార్యదర్శులు సీనియారిటీ ప్రకారం 8 లేదా 9 నెలలకు ఒకరు చొప్పున పదవుల నుండి మారిపోతున్నారు...దీనితో ఒక కార్యదర్శికి అంతా వివరించి, ఆర్డర్ పాస్ చేసే సమయానికి వారు మారిపోతుండడంతో...మళ్ళీ కథ మొదటికి వచ్చేది.

దీనితో ప్రస్తుతం ఉన్న హోమ్ శాఖ కార్యదర్శి ఇరుపక్షాల వాదనలను వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈయనకు కూడా ఇంకా నాలుగు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండడంతో...ఈ ప్రక్రియను ఆలోపే పూర్తి చేయాలని ఇరు  రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి. ఈయన అయినా త్వరగా ఆర్డర్ పాస్ చేస్తాడా...? లేదా పదవి నుండి తొలగిపోతాడా తెలియాల్సి ఉంది. ఇక పోతే ఈ సమస్యను కేవలం పది సంవత్సరాలలోపే పరిష్కరించుకోవాలి. లేదంటే మళ్ళీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదముంది.  



బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???

విశాఖ జిల్లాలో తెలుగుదేశానికి షాక్...?

రేవంత్ పై పెరుగుతున్న బీజేపీ ఒత్తిడి...?

ఎన్టీఆర్ వద్దన్న కథతో నితిన్ ?

రెడ్ల మీద గురిపెట్టిన బీజేపీ...?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>