PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababud65ecebe-13a7-4f00-9fab-fd2730b90db2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababud65ecebe-13a7-4f00-9fab-fd2730b90db2-415x250-IndiaHerald.jpg పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ తీరుపై నమ్మకం లేదని.. ఎన్నికల కమిషనర్ ఒక రబ్బర్ స్టాంప్ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీరి ఎన్నికల నిర్వహణపై నమ్మకం లేదని, ఆమె రబ్బర్ స్టాంప్ కమిషనర్ అని.. అందువల్ల తాము ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని.. ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ వాళ్లు పోరాడినా, కేసులు పెట్టరనిchandrababu;jayalalitha;raghu;tiru;bharatiya janata party;telangana;government;tirupati;cbi;mla;husband;tdp;partyచంద్రబాబు తప్పుడు నిర్ణయం.. తిరుపతిలో బీజేపీకి లాభిస్తుందా..?చంద్రబాబు తప్పుడు నిర్ణయం.. తిరుపతిలో బీజేపీకి లాభిస్తుందా..?chandrababu;jayalalitha;raghu;tiru;bharatiya janata party;telangana;government;tirupati;cbi;mla;husband;tdp;partySat, 03 Apr 2021 12:10:37 GMT
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ తీరుపై నమ్మకం లేదని.. ఎన్నికల కమిషనర్ ఒక రబ్బర్ స్టాంప్ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీరి ఎన్నికల నిర్వహణపై నమ్మకం లేదని, ఆమె రబ్బర్ స్టాంప్ కమిషనర్ అని.. అందువల్ల తాము ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని.. ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

టీడీపీ వాళ్లు పోరాడినా, కేసులు పెట్టరని, గెలిచినా ఓడినట్లు ప్రకటిస్తారని అందుకే తమ పార్టీ లో చర్చించి ఎన్నికలలో పాల్గొనరాదని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. పోటీచేసిన అభ్యర్దులతో మాట్లాడామని ,మండల పార్టీ నేతలతో కూడా మాట్లాడానని ఆయన తెలిపారు. ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలలో తాము భాగస్వాములం కాబోమని ఆయన అన్నారు. అంతే కాదు.. గతంలో జయలలిత ఎన్నికలను బహిష్కరించారని.. జ్యోతిబసు కూడా చేశారని.. ఇప్పుడు తమకు కూడా ఎన్నికల బహిష్కరణ చేయక తప్పలేదని ఆయన అన్నారు.
 
అయితే ఈ నిర్ణయం ఇప్పుడు బీజేపీకి లాభిస్తోంది. తిరుపతి ఉపఎన్నికల్లో దీన్ని బీజేపీ బాగా వాడుకుంటోంది. తెదేపా రాజకీయ రణరంగం నుంచి పక్కకు తప్పుకుందని తిరుపతిలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇక బీజేపీమాత్రమే కనిపిస్తున్న ప్రత్యామ్నాయమంటున్నారు.  వైకాపా కు ఓటేస్తే ఎంపీల సంఖ్య పెరుగుతుంది తప్ప అభివృద్ధి ఉండదంటున్నారు. అధికారంలో ఉండి ప్రశ్నించలేని పార్టీకి ఓట్లెందుకు... ఎన్నికలెందుకు? అంటూ బీజేపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీకి ఓటేస్తే తిరుమల లో అన్యమత ప్రచారాలు, దేవాలయాలు లేకుండా బలమైన చట్టం తెస్తామని.. సాంకేతికత ఉన్నా...విగ్రహాల ధ్వంసం చేసిన వారిని పట్టుకోవటం లేదని.. సీబీఐ కి ఇచ్చామని వైకాపా ప్రభుత్వం తప్పుకుంటుందని తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. దేవాలయాల స్థలాల ఆక్రమణ, అన్యమత ప్రార్థన మందిరాల నిర్మాణం జరుగుతోందని.. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి మతప్రచారం చేసుకుంటోందని తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు నిర్ణయం తిరుపతిలో బీజేపీకిలాభించేలా ఉంది.



అర్చ‌కుల వ‌యోః ప‌రిమితిపై టీటీడీ సంచ‌ల‌నం

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>