CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/saloon-shop-ab89acad-942f-4b18-8637-6200b08fc0f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/saloon-shop-ab89acad-942f-4b18-8637-6200b08fc0f8-415x250-IndiaHerald.jpgప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. సెలూన్ షాపులో పనిచేసే ఓ కుర్రాడు ఆమెకు పరిచయం అయ్యాడు. అరగంటలోనే వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. చివరకు అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. హైదరాబాద్ లో ఓల్డ్ బోయిన్ పల్లిలోని దుబాయి గేట్ లో 25 ఏళ్ల ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. 2018వ సంవత్సరంలో తన అక్క పిల్లలు వేసవి సెలవులకు హైదరాబాద్ కు వచ్చారు. వారికి ఆ యువతి సిటీ అంతా చూపించింది.saloon shop;prema;hyderabad;smart phone;police;marriage;love;february;arrest;vegetable market;local language;allu sneha;june;marchసెలూన్ షాపులో కుర్రాడితో యువతికి పరిచయం.. మూడేళ్ల తర్వాత..!సెలూన్ షాపులో కుర్రాడితో యువతికి పరిచయం.. మూడేళ్ల తర్వాత..!saloon shop;prema;hyderabad;smart phone;police;marriage;love;february;arrest;vegetable market;local language;allu sneha;june;marchSat, 03 Apr 2021 10:05:55 GMTప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. సెలూన్ షాపులో పనిచేసే ఓ కుర్రాడు ఆమెకు పరిచయం అయ్యాడు. అరగంటలోనే వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. చివరకు అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. హైదరాబాద్ లో ఓల్డ్ బోయిన్ పల్లిలోని దుబాయి గేట్ లో 25 ఏళ్ల ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. 2018వ సంవత్సరంలో తన అక్క పిల్లలు వేసవి సెలవులకు హైదరాబాద్ కు వచ్చారు. వారికి ఆ యువతి సిటీ అంతా చూపించింది. ఇదే క్రమంలో వారికి క్షవరం చేయించడానికి స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్ వద్ద కుషాల్ హెయిర్ కటింగ్ సెలూన్ కు తీసుకెళ్లింది.

అక్కడ ప్రజ్ఞాపూర్‌కు చెందిన దామకొండ కనకరాజు అనే 28 ఏళ్ల కుర్రాడితో ఆమెకు పరిచయం అయింది. ఆ సెలూన్లో ఉన్నది అరగంటే అయినా వారిద్దరి మధ్య ముచ్చట్లు మాత్రం తారస్థాయికి చేరుకున్నాయి. ఆ ఒక్క అరగంటలోనే ఇద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. 2018వ సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఆమెతో కలిసి సిటీ అంతా ఆ కుర్రాడు చక్కర్లు కొట్టాడు.

ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునేవాళ్లు. ఈ క్రమంలోనే గతేడాది మార్చి నెలలో కనకరాజు తన సొంతూరికి వెళ్లాడు. తిరిగి జూన్ నెలలో తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న అతడు సడన్ గా కనిపించకుండా పోయాడు. ఆరా తీస్తే సొంతూరికి వెళ్లాడని ఆమెకు తెలిసింది. ఆ యువతి అతడికి ఫోన్ చేసింది. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని నిలదీసింది. దీంతో ఆ కుర్రాడు ఓ షాకింగ్ నిజాన్ని చెప్పాడు.

అతను మనిద్దరి కులాలు వేరు వేరు. కాబట్టి మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. నన్ను మర్చిపో. వేరొకరిని పెళ్లి చేసుకో. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.’ అంటూ అతడు బాంబులాంటి వార్తను చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసినా స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి మార్చి 18వ తారీఖున పోలీసులకు ఫోన్ చేసింది. పరారీలో ఉన్న అతడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


తిరుమల తలనీలాల రవాణాపై ముదురుతున్న వివాదం...?

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>