HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cool-drinks-latest-news98386d77-21cd-4567-b40e-526ebd656b95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cool-drinks-latest-news98386d77-21cd-4567-b40e-526ebd656b95-415x250-IndiaHerald.jpgవేస‌వికాలంలో గొంతెండిపోతుంటుంది. దాహం ఎక్కువ‌గా వేస్తుంది. దాహార్తి తీర్చుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ శీత‌ల‌ పానీయాల‌వైపు దృష్టిసారిస్తారు. తియ్య‌తియ్య‌గా.. చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఉన్నాయిలే అని ఎక్కువ లాంగించేశారా.. అంతే సంగ‌తులు. తాత్కాలికంగా దాహం తీరింద‌నుకున్నా దానివ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్క‌వుగా వ‌స్తున్నాయి. సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉండే చ‌ల్ల‌టి పానీయాలు తీసుకోవ‌డం వేరు.. బ‌య‌ట దుకాణాల్లో దొరికే శీత‌ల‌పానీయాలు తీసుకోవ‌డం వేరు. ఎడాపెడా శీత‌ల‌పానీయాలు కొనుగోలుచేసి తాగ‌కుండా కాస్త ఆలోచించుకొని తాగండి.. cool drinks, latest news;tara;survey;heart;dehydrationకూల్‌డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా?? ఒక్క నిముషం..కూల్‌డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా?? ఒక్క నిముషం..cool drinks, latest news;tara;survey;heart;dehydrationSat, 03 Apr 2021 06:46:04 GMTవేస‌వికాలంలో గొంతెండిపోతుంటుంది. దాహం ఎక్కువ‌గా వేస్తుంది. దాహార్తి తీర్చుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ శీత‌ల‌ పానీయాల‌వైపు దృష్టిసారిస్తారు. తియ్య‌తియ్య‌గా.. చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఉన్నాయిలే అని ఎక్కువ లాంగించేశారా.. అంతే సంగ‌తులు. తాత్కాలికంగా దాహం తీరింద‌నుకున్నా దానివ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్క‌వుగా వ‌స్తున్నాయి. సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉండే చ‌ల్ల‌టి పానీయాలు తీసుకోవ‌డం వేరు.. బ‌య‌ట దుకాణాల్లో దొరికే శీత‌ల‌పానీయాలు తీసుకోవ‌డం వేరు. ఎడాపెడా శీత‌ల‌పానీయాలు కొనుగోలుచేసి తాగ‌కుండా కాస్త ఆలోచించుకొని తాగండి.. లేదంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్న‌వార‌వుతారు.

కూల్‌డ్రింక్స్ ఎక్కువ‌గా తీసుకోవ‌డంవ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు

# కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరుగుతాం. వీటిని త‌రుచుగా తీసుకోవ‌డంవ‌ల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్‌డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం క‌లుగుతుంది. ఒక్కోసారి మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

# బరువు తగ్గాలనుకునేవారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ తినాలినిపిస్తుంటుంది. దీనివ‌ల్లే బరువు పెరిగే అవకాశాలున్నాయి.

#  స్వీట్ సోడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది.

#  అత్యధిక స్థాయిలో ఉండే చక్కెర శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

# బరువు ఒక్క‌సారిగా పెరుగుతారు. కూల్ డ్రింక్స్‌లో కెలోరీలు, చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మ‌ధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

#  శీతల పానీయాలతో ఎసిడిటీతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు తీవ్ర‌మ‌వుతాయి.

# గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేవారిపై సర్వే చేయగా అధిక‌శాతం అనారోగ్యానికి గుర‌వుతున్న‌ట్లు తేలింది. కాబ‌ట్టి వాటికి సాధ్య‌మైనంత దూరంగా ఉండ‌టం అవ‌స‌రం.

# వీటిల్లో ఉండే కెఫీన్ మ‌న శ‌రీరంలో డోప‌మైన అనే కెమిక‌ల్‌ను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్త‌పోటు పెరుగుతుంది.

# స్త్రీలు గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఈ శీత‌ల పానీయాలు తీసుకుంటే గ‌ర్భ‌విచ్ఛిత్తి జ‌రిగే ప్ర‌మాద‌ముంది.





ఏపీలో ఆ మూడు జిల్లాల్లో క‌రోనా ఉగ్ర‌రూపం

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>