SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news22f79b5e-c430-4f3b-853f-535088507743-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news22f79b5e-c430-4f3b-853f-535088507743-415x250-IndiaHerald.jpg ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గన్ తాజాగా ఓ క్రీడా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో టీమిండియా ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ లీగ్ లు జరిగిన వాటిలో పాల్గొనేందుకు టీమిండియా ప్లేయర్స్ ఆసక్తి కనబరుస్తారు అని అన్నాడు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ వస్తుందని పేర్కొన్నాడు. sports news;india;england;letter;yuva;icc t20;joshటీమిండియా పై సంచలన కామెంట్స్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ !!టీమిండియా పై సంచలన కామెంట్స్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ !!sports news;india;england;letter;yuva;icc t20;joshSat, 03 Apr 2021 07:00:00 GMT ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గన్ తాజాగా ఓ క్రీడా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో టీమిండియా ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీమిండియా ఆటగాళ్లు  కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ లీగ్ లు జరిగిన వాటిలో పాల్గొనేందుకు టీమిండియా ప్లేయర్స్ ఆసక్తి కనబరుస్తారు అని అన్నాడు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ  వస్తుందని పేర్కొన్నాడు. 

అయితే, కొన్ని లీగ్‌ల వల్ల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ క్రికెట్‌ టోర్నీల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయని పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని ఆయన కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు క్రికెట్‌ ఫార్మాట్ల మధ్య పెద్ద తేడా లేకుండా పోయిందని, దేనికి దక్కాల్సిన ప్రాధాన్యత దానికి దక్కడం లేదని ఆయన వాపోయాడు. అయితే, టీ20 క్రికెట్‌ యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని, వారి కెరీర్‌ బిల్డప్‌ చేసుకునేందుకు ఈ ఫార్మాట్‌ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు.

ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టు ఇండియా పర్యటనలో వైట్ వాష్ గా మారి తిరిగి వారి దేశం చేరుకుంది. టీమిండియా కోసం సుధీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్,టీ20 సిరీస్, వన్డే సిరీస్, ఇలా మూడు వరుస సిరీస్ లో ఘోరంగా ఓటమి చవిచూసింది. ఇకా టీమిండియా విషయానికొస్తే వరుస విజయాలతో ఫుల్ జోష్ ఉన్న టీమిండియా ఆటగాళ్లు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఐపీఎల్ టోర్నీ లో పాల్గొంటున్నారు. ఇక ఐపీఎల్ ఈ నెల 9 నుండి ప్రారంభం కానుంది. ఇక టీ20 ప్రపంచ కప్ కూడా ఈసారి ఇండియా లోనే జరుగుతుండడంతో టీమిండియా ఆటగాళ్లు తమ ప్రదర్శనను మరింత మొరుగు పరచుకోవలసిన అవసరం ఉంది.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>