PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-a6d69347-7813-4d55-9469-e047acd910a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-a6d69347-7813-4d55-9469-e047acd910a5-415x250-IndiaHerald.jpgతెలుగుదేశానికి ఇపుడు చావో రేవో అన్న సమస్య వచ్చిపడింది. వరస ఎన్నికలు తల బొప్పి కడుతున్న వేళ తిరుపతి వంటి వైసీపీకి ఫుల్ ఫావరేట్ గా ఉన్న సీటుతో పోటీ వచ్చిపడింది. దాంతో టీడీపీ మొత్తానికి మొత్తం అన్ని ప్రాణాలు అక్కడే పెట్టేసి పోరాడుతోంది. tdp ycp;view;tiru;telugu;tirupati;fort;husband;tdp;ycp;party;mantraతిరుపతిలో టీడీపీ టార్గెట్ అదే...?తిరుపతిలో టీడీపీ టార్గెట్ అదే...?tdp ycp;view;tiru;telugu;tirupati;fort;husband;tdp;ycp;party;mantraSat, 03 Apr 2021 15:00:00 GMTతెలుగుదేశానికి ఇపుడు చావో రేవో అన్న సమస్య వచ్చిపడింది. వరస ఎన్నికలు తల బొప్పి కడుతున్న వేళ తిరుపతి వంటి వైసీపీకి ఫుల్ ఫావరేట్ గా ఉన్న సీటుతో పోటీ వచ్చిపడింది. దాంతో టీడీపీ మొత్తానికి మొత్తం అన్ని ప్రాణాలు అక్కడే పెట్టేసి పోరాడుతోంది.

తిరుపతి ఎన్నికల్లో తెలుగుదేశం అసలైన టార్గెట్ ఏంటో తెలిస్తే వైసీపీ కూడా పూర్తిగా  అలెర్ట్ కావాల్సిందే. తెలుగుదేశం పార్టీకి అయిదున్నర లక్షల ఓట్లు ఇపుడు అక్కడ కావాలి. అందుకోసం మొత్తం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలను అక్కడే మోహరించింది. అదే విధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తిరుపతిలోనే మకాం వేశారు. అదే సమయంలో పార్టీకి ఉన్న సీనియర్ నాయకులు కూడా ఒక్కో మండలాన్ని తీసుకుని మరీ టీడీపీ కోసం అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ప్రతీ ఇంటికీ ఒకటిని నాలుగు సార్లు వెళ్ళి మరీ టీడీపీకి ఓట్లు వేయమని అడగాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది.

టీడీపీ ప్రచారం చాప కింద నీరులా సాగిపోతోంది. నిజానికి అధికార వైసీపీకి కంచుకోట లాంటి సీట్లో టీడీపీ గెలుపు ఆశించడం అత్యాశే అవుతుంది. అది కూడా ఈ సమయంలో అంటే అంతకు మించిన సాహసం ఉండదు. కానీ టీడీపీకి కావాల్సింది విజయం కాదు నైతిక విజయం. అంటే గత ఎన్నికల్లో వచ్చిన అయిదు లక్షల ఓట్లను అలాగే కాపాడుకుంటూ దాన్ని కనీసంగా అయిదున్నర లక్షల దాకా పెంచుకోవాలని ఒక స్ట్రాటజీ. ఆ విధంగా చేస్తే వైసీపీ మెజారిటీ గత ఎన్నికల కంటే కూడా బాగా తగ్గుతుంది. అలా వైసీపీకి తగ్గిన మెజారిటీని చూపించి ఏపీలో టీడీపీని బతికించుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. మొత్తానికి టీడీపీ వ్యూహం అయితే అయిదున్నర లక్షల ఓట్లు. మరి వైసీపీ దీన్ని ధీటుగా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఏది ఏమైనా తిరుపతి ఇపుడు ఆసక్తిని పెంచేస్తోంది.







బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???

విశాఖ జిల్లాలో తెలుగుదేశానికి షాక్...?

రేవంత్ పై పెరుగుతున్న బీజేపీ ఒత్తిడి...?

ఎన్టీఆర్ వద్దన్న కథతో నితిన్ ?

రెడ్ల మీద గురిపెట్టిన బీజేపీ...?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>