PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp793cb2c6-aace-4799-8804-73a62c30ff84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp793cb2c6-aace-4799-8804-73a62c30ff84-415x250-IndiaHerald.jpgఏపీలో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలకు కొత్త ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగనుండగా, 10న కౌంటింగ్ జరగనుంది. ఏపీలోని 653 జెడ్పీటీసీ, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి గతేడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు కూడా స్వీకరించారు.tdp;kumaar;cycle;tdp;ycp;marchపోటీలో టీడీపీ...ఆ విషయంలో తప్పదా?పోటీలో టీడీపీ...ఆ విషయంలో తప్పదా?tdp;kumaar;cycle;tdp;ycp;marchSat, 03 Apr 2021 01:00:00 GMT

ఏపీలో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలకు కొత్త ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగనుండగా, 10న కౌంటింగ్ జరగనుంది. ఏపీలోని 653 జెడ్పీటీసీ, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి గతేడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు కూడా స్వీకరించారు.


అలాగే నామినేషన్స్ పరిశీలన, ఉపసంహరణ, ఏకగ్రీవాలు కూడా ఖరారైపోయాయి. అయితే ఇంకా ఎన్నికై జరగాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో నిమ్మగడ్డ, మార్చి 14న ఎన్నికల ప్రక్రియని వాయిదా వేశారు. అయితే గతేడాది ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచే నీలం సాహ్ని ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే దీని ప్రకారం చూసుకుంటే అప్పుడు నామినేషన్స్ వేసిన వారు పోటీలో ఉంటారు. అలాగే టీడీపీ అభ్యర్ధులు కూడా పోటీలో ఉంటారు.


అయితే తాజాగా టీడీపీ అధిష్టానం ఎన్నికలని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ ఉన్నప్పుడే వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, అరాచకాలు చేసిందని, అక్కడకి టీడీపీ అభ్యర్ధులు ఎదురు నిలబడి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డారని, కానీ ఇప్పుడు నీలం సాహ్ని కమిషనర్ అయ్యారు కాబట్టి వైసీపీ మరింత రెచ్చిపోయే అవకాశముందని, అందుకనే ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ అధిష్టానం ఫిక్స్ అయింది.


ఒకవేళ టీడీపీ ఎన్నికలని బహిష్కరించకపోతే సమస్య లేదు కానీ, బహిష్కరించిన కూడా అభ్యర్ధులు మాత్రం పోటీలో ఉంటారు. అంటే ప్రచారం చేయడం గానీ, ప్రజల దగ్గరకు వెళ్ళి ఓట్లు అడగడం లాంటివి చేయరు. కానీ బ్యాలెట్ బాక్సుల్లో సైకిల్ గుర్తు ఉంటుంది. అయితే ఇక్కడ టీడీపీ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశం ఉండదు. అంటే పోలింగ్ శాతం కూడా తగ్గుతుంది. ఏదేమైనా టీడీపీ మాత్రం పోటీలో ఉంటుంది. మరి చూడాలి ఈ పరిషత్ ఎన్నికల్లో ఇంకా ఎన్ని మలుపులు చోటు చేసుకుంటాయో.





తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>