PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp227238b0-7443-4b93-b6ec-c3d7cd4c9f0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp227238b0-7443-4b93-b6ec-c3d7cd4c9f0d-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో యువ నేతల దూకుడు పెరుగుతుంది. ఇప్పటికే అధికార వైసీపీ యువ నాయకత్వంతో నిండిపోయింది. వైసీపీలో మెజారిటీ శాతం యువ నాయకుల డామినేషన్ కనిపిస్తోంది. అలాగే గతంలో మాదిరిగా కాకుండా ఈ యువ నేతలు సరికొత్తగా రాజకీయం చేస్తూ, మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తమ పార్టీ తరుపున బలమైన గళం విప్పుతున్నారు. ఇలా దూకుడుగా ఉండటంతోనే కార్యకర్తలు సైతం, అలాంటి యువ నాయకులని బాగా అభిమానిస్తున్నారు. ఉదాహరణకు వైసీపీలో గుడివాడ అమర్నాథ్, బైరెడ్డి సిద్ధార్థ్, దేవినేని అవినాష్, కtdp;siddharth;bharath;sravani;srinivas;sriram;vijay;amarnath cave temple;bandara;andhra pradesh;devineni avinash;sri bharath;nalamada padmavathi reddy;bhuma akhila priya;tdp;joseph vijay;paritala ravindra;yuva;ycp;bandaru sravani;reddy;jonnalagadda padmavathy;dookudu;party;raccha;abbaya chowdary kothariటీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?tdp;siddharth;bharath;sravani;srinivas;sriram;vijay;amarnath cave temple;bandara;andhra pradesh;devineni avinash;sri bharath;nalamada padmavathi reddy;bhuma akhila priya;tdp;joseph vijay;paritala ravindra;yuva;ycp;bandaru sravani;reddy;jonnalagadda padmavathy;dookudu;party;raccha;abbaya chowdary kothariSat, 03 Apr 2021 04:00:00 GMT

ఏపీ రాజకీయాల్లో యువ నేతల దూకుడు పెరుగుతుంది. ఇప్పటికే అధికార వైసీపీ యువ నాయకత్వంతో నిండిపోయింది. వైసీపీలో మెజారిటీ శాతం యువ నాయకుల డామినేషన్ కనిపిస్తోంది. అలాగే గతంలో మాదిరిగా కాకుండా ఈ యువ నేతలు సరికొత్తగా రాజకీయం చేస్తూ, మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తమ పార్టీ తరుపున బలమైన గళం విప్పుతున్నారు. ఇలా దూకుడుగా ఉండటంతోనే కార్యకర్తలు సైతం, అలాంటి యువ నాయకులని బాగా అభిమానిస్తున్నారు. ఉదాహరణకు వైసీపీలో గుడివాడ అమర్నాథ్, బైరెడ్డి సిద్ధార్థ్, దేవినేని అవినాష్, కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, విడదల రజిని, జొన్నలగడ్డ పద్మావతి, మార్గాని భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, అబ్బయ్య చౌదరీ ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో క్రేజ్ ఉన్న యువనాయకులు చాలామందే ఉన్నారు.


ఇక టీడీపీలో కూడా యువ నేతలకు ఏమి కొదవ లేదు. రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏలూరి సాంబశివరావు, చింతకాయల విజయ్, నాదెండ్ల బ్రహ్మం, గంటి హరీష్, బండారు శ్రావణి, భూమా అఖిలప్రియ ఇలా చాలామంది నాయకులు టీడీపీలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ మరో యువ నాయకురాలు యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టారు. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తనయురాలు ఏవీ జస్వంతి రెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు.


ముఖ్యంగా వైసీపీపై టీడీపీ చేసే పోరాటానికి సపోర్ట్‌గా ఉంటున్నారు. పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపిస్తున్నారు. ఇలా టీడీపీ తరుపున గట్టిగా పోరాటం చేస్తున్న జస్వంతి...భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోలేదని పలువురు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఏవీ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. వీరి మధ్య ఏ రేంజ్‌లో రచ్చ జరుగుతూ వచ్చిందో అందరికీ తెలిసిందే. మొన్న ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డి హత్యకు భూమా అఖిల కుట్ర పన్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే ఏవీ సుబ్బారెడ్డి సైతం అఖిలప్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. జస్వంతి కూడా అఖిల టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అఖిలకు ధీటుగా పార్టీలో ఎదిగేందుకు జస్వంతి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.





బన్నీ అభిమానుల కోరిక తీరేనా..??

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>