EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-parishat-elections-6383abb7-dade-4a8f-8579-c4aa9cb1b8fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-parishat-elections-6383abb7-dade-4a8f-8579-c4aa9cb1b8fd-415x250-IndiaHerald.jpgప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే పునాది. రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల ప్రక్రియకే భయపడి వెనకడుగేస్తే, దాని నుంచి దూరంగా పారిపోతే.. అసలు పార్టీకి అర్థముంటుందా? తాము భయపడి పారిపోలేదని, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు ఇలా నిరసన తెలుపుతున్నామని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎన్నికల బహిష్కరణ అనే ప్రకటనతో అసలు చంద్రబాబు కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు? పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, వారం రోజుల తర్వాత జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబితే వైరిపక్షాలు గేలి చేయకుండా ఉంటాయా? ఇవన్నీ ఆలోచిchandrababu, parishat elections,;cbn;tiru;bharatiya janata party;రాజీనామా;tirupati;husband;tdp;ycp;jaggampeta;petta;partyచంద్రబాబు తప్పు చేశారా..? దాని ఫలితం ఏంటి..?చంద్రబాబు తప్పు చేశారా..? దాని ఫలితం ఏంటి..?chandrababu, parishat elections,;cbn;tiru;bharatiya janata party;రాజీనామా;tirupati;husband;tdp;ycp;jaggampeta;petta;partySat, 03 Apr 2021 08:00:00 GMTప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే పునాది. రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల ప్రక్రియకే భయపడి వెనకడుగేస్తే, దాని నుంచి దూరంగా పారిపోతే.. అసలు పార్టీకి అర్థముంటుందా? తాము భయపడి పారిపోలేదని, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు ఇలా నిరసన తెలుపుతున్నామని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎన్నికల బహిష్కరణ అనే ప్రకటనతో అసలు చంద్రబాబు కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు? పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, వారం రోజుల తర్వాత జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబితే వైరిపక్షాలు గేలి చేయకుండా ఉంటాయా? ఇవన్నీ ఆలోచించారో లేదో కానీ, చంద్రబాబు మాత్రం అస్త్ర సన్యాసం చేసేశారు. పరిషత్ ఎన్నికలని బహిష్కరిస్తున్నామని చెప్పి పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నింపారు.

చంద్రబాబు తప్పు చేశారని స్వయానా అదే పార్టీ నేతలు కామెంట్ చేయడం విశేషం. టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ చార్జి జ్యోతుల నెహ్రూ.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ దశలో వెనకడుగు వేస్తే కార్యకర్తలు అన్యాయమైపోతారని అన్నారాయన. పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయన నిర్ణయాన్ని సమర్థించేవారు కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని, పోటీకి దిగాల్సిందేనని కోరుతున్నారు.

వాస్తవానికి చంద్రబాబు ముందు కూడా ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆల్రడీ ఏకగ్రీవాలతో పరిషత్ ఎన్నికల్లో పాతికశాతం సీట్లు వైసీపీ గెలుచుకుంది. మిగిలిన చోట్ల నామమాత్రపు పోటీ ఉంది. ఈ దశలో పరిషత్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా వస్తే, దాని ప్రభావం తిరుపతి ఉప ఎన్నికలపై పడుతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి బాంబు పేల్చారు. అయితే ఒక రాజకీయ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదనేది ప్రజాస్వామ్య వాదుల అభిప్రాయం. మరోవైపు వైరి పక్షాలు చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తున్నాయి. టీడీపీ శకం ముగిసిందని, దానికి ఇదే నిదర్శనం అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీకి తామే అసలు సిసలు ప్రత్యామ్నాయం అని, టీడీపీ ఎన్నికలకు భయపడి పారిపోయిందని బీజేపీ అంటోంది. ఈ దశలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని అటు నాయకులు, కార్యకర్తలు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందని, టీడీపీని వీడేవారి సంఖ్య ఎక్కువవుతుందని అనుమానిస్తున్నారు.



భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>