QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimaatae4608f1a-902b-43bb-9878-ea8ad70ce75d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimaatae4608f1a-902b-43bb-9878-ea8ad70ce75d-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి MANCHIMAATA;vedhika;india;kanna lakshminarayana;v;mahaమంచిమాట : అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి.. అదే నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి..!మంచిమాట : అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి.. అదే నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి..!MANCHIMAATA;vedhika;india;kanna lakshminarayana;v;mahaSat, 03 Apr 2021 06:00:00 GMT
ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి.. అదే నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి..!



దీని అర్థం ఏమిటంటే.. ఏదైనా ఒక విషయంలో అబద్ధం చెప్పాలని తలచుకున్నప్పుడు అబద్ధాలు చెప్పడానికి కూడా తెలిసి ఉండాలి. అంతే కాకుండా అబద్ధాలు ఎలా చెప్పాలో, ఒకవేళ మనం చెబుతున్నది అబద్దమా.. నిజమా అని ఎదుటివారు తెలుసుకునే సమయం కూడా వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే,  అందుకు తగ్గట్టు మనకు తెలివి, సమయస్ఫూర్తి రెండూ ఉండాలి . అలా లేని నాడు అబద్దం చెప్పిన వెంటనే ఇతరులకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ అబద్ధం చెప్పేటప్పుడు తెలివిగా ఉండాలి. ఇక నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. నిజం చెప్పేటప్పుడు సామాన్యంగా ఎవరు అంత సాహసం చేయరు. కాబట్టి ఏదైనా నిజం చెప్పాలి అంటే ధైర్యం గా వుండాలి. అని దీని అర్థం..


ఉదాహరణకు ఏదైనా ఒక విషయంలో తప్పు జరిగిందనుకోండి. ఆ తప్పును కప్పి పుచ్చాలి అంటే మనం చెబుతున్నది అబద్ధం అని ఎదుటివాళ్ళు గుర్తించకూడదు. అంతలా సమయస్ఫూర్తితో చెప్పాలి. ఇక ఒకవేళ ఆ తప్పుకు మీరు నిజమే చెప్పాలి అని అనుకున్నప్పుడు. ఎంతో ధైర్యం ఉండాలి. అబద్ధం చెప్పే కన్నా, నిజం చెప్పి నలుగురిలో గౌరవంగా నిలవడం  ఎంతో మంచిది. అబద్దం అనేది అప్పటికి మాత్రమే పనికొస్తుంది. కానీ నిజం చిరకాలం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మహా అయితే అర్థం చేసుకుంటారు.





టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తున్న నలభై ఏళ్ల హీరోయిన్.. ఎవరో తెలుసా..!

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>