HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/piles-18f4ec06-c30b-46c1-9fc3-a090f889f55a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/piles-18f4ec06-c30b-46c1-9fc3-a090f889f55a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఈ మొలల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి ముఖ్యంగా మలద్వారం లోపల చుట్టూ వాపు వచ్చి, పెరిగే కణితులను మనం ఫైల్స్ లేదా మొలలు లేదా హెమరాయిడ్స్ అని అంటారు. ఇవి సాధారణంగా రక్త కణాలు మొదలైనవాటితో ఏర్పడే కణ సముదాయాలు. అయితే ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి. ఒక్కోసారి మలద్వారం బయట కూడా ఇవి పెరగవచ్చు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. వాటంతటవే తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరమౌతుంది. PILES;korchaమనం తీసుకొనే ఆహారపు అలవాట్లు కూడా పైల్స్ రావడానికి కారణమవుతాయా..?మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు కూడా పైల్స్ రావడానికి కారణమవుతాయా..?PILES;korchaSat, 03 Apr 2021 13:40:00 GMT
సాధారణంగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఈ మొలల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి ముఖ్యంగా మలద్వారం లోపల చుట్టూ వాపు వచ్చి, పెరిగే కణితులను మనం ఫైల్స్ లేదా మొలలు లేదా హెమరాయిడ్స్  అని అంటారు. ఇవి సాధారణంగా రక్త కణాలు మొదలైనవాటితో  ఏర్పడే కణ సముదాయాలు. అయితే ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి. ఒక్కోసారి మలద్వారం బయట కూడా ఇవి పెరగవచ్చు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదు. వాటంతటవే తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరమౌతుంది.

ఈ మొలల సమస్య ఎక్కువగా రావడానికి కారణం జన్యు కారణాలు. అలాగే వృద్ధాప్యానికి చేరుకుంటున్న సమయంలో ఎక్కువగా వస్తాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా గర్భవతుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గర సిరలు పొంగి, వాచి  మొలలుగా  మారుతాయి. అంతేకాకుండా మొలలకు ముఖ్యకారణం ఊబకాయం కూడా చెప్పవచ్చు. అధిక బరువు ఉన్నప్పుడు కూడా ఈ మొలల సమస్య ఏర్పడుతుంది .అయితే మన జీవన శైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం. మనం అనారోగ్యమైన ఆహారాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు మొలలు కూడా వస్తాయి.

ముఖ్యంగా ఈ పైల్స్ రావడానికి కారణం కాలేయ సంబంధిత సమస్యలు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడేవారికి ఈ మొలలు అధికంగా వస్తాయి.  మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం,  రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వల్ల మల విసర్జన సమయంలో మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వచ్చి రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.

గర్భధారణ సమయంలో కూడా ఈ ఫైల్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంతే కాకుండా క్రాన్స్ డిసీజ్,  అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో ఈ మొలలు ఏర్పడే అవకాశం ఎక్కువ.

ఇక గంటల తరబడి ఒకేచోట కూర్చుని, పనిచేసే వారిలో కూడా ఊబకాయం, అలాగే తీవ్రమైన మలబద్ధకం తో బాధపడుతున్న వారిలో మొలలు వచ్చే అవకాశం ఎక్కువ.





ఎన్టీఆర్ వద్దన్న కథతో నితిన్ ?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!

ఐపీఎల్లో ఈ సారి లాస్ట్ ప్లేస్ ఆ టీమ్‌దే

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>