PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-tmc-modi-mamatha-latest-newsaf28abf7-6cf4-4026-8fc1-700d5e5e7ffa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-tmc-modi-mamatha-latest-newsaf28abf7-6cf4-4026-8fc1-700d5e5e7ffa-415x250-IndiaHerald.jpgప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నో రాష్ట్రాల్లో విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగించాం.. బెంగాల్‌ను మాత్రం ఎందుకు కైవ‌సం చేసుకోలేమంటూ మోడీ, అమిత్ షా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వీరిద్ద‌రి విధానాలు దేశ ప్ర‌జాస్వామ్యానికే గొడ్డ‌లిపెట్టుగా మారాయ‌నేది మ‌మ‌తాబెన‌ర్జీ భావన ఎట్టిపరిస్థితుల్లోను బెంగాల్లో బీజేపీని అడుగుపెట్ట‌నివ్వ‌న‌ని దీదీ శ‌ప‌థం చేశారు.bjp, tmc, modi, mamatha, latest news;modi;amit shah;bhavana;raaga;bharatiya janata party;narendra modi;amith shah;assembly;cheque;central governmentతుపాకీ మీరు గురిపెట్టండి.. ట్రిగ్గ‌ర్ మేం నొక్కుతాంతుపాకీ మీరు గురిపెట్టండి.. ట్రిగ్గ‌ర్ మేం నొక్కుతాంbjp, tmc, modi, mamatha, latest news;modi;amit shah;bhavana;raaga;bharatiya janata party;narendra modi;amith shah;assembly;cheque;central governmentSat, 03 Apr 2021 08:15:25 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నో రాష్ట్రాల్లో విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగించాం.. బెంగాల్‌ను మాత్రం ఎందుకు కైవ‌సం చేసుకోలేమంటూ మోడీ, అమిత్ షా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వీరిద్ద‌రి విధానాలు దేశ ప్ర‌జాస్వామ్యానికే గొడ్డ‌లిపెట్టుగా మారాయ‌నేది మ‌మ‌తాబెన‌ర్జీ భావన ఎట్టిపరిస్థితుల్లోను బెంగాల్లో బీజేపీని అడుగుపెట్ట‌నివ్వ‌న‌ని దీదీ శ‌ప‌థం చేశారు. వారిద్ద‌రికీ అనుకూలంగా ఎన్ని ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ పెట్టుకున్న‌ప్ప‌టికీ అంతిమ విజ‌యం త‌న‌దేన‌నే ధీమాతో మ‌మ‌తాబెన‌ర్జీ ఉన్నారు.

ఢీకొడుతున్న దీదీ
రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్డీయే స‌ర్కార్ వైఖ‌రి మారిపోయింది. ప్ర‌యివేటీక‌ర‌ణ రాగం అందుకోవ‌డంతోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వాధినేత‌ల‌ను సంప్ర‌దించ‌కుండా, మంచిచెడ‌లు గురించి ఆలోచించ‌కుండా సంస్థ‌ల‌ను గుంప‌గుత్త‌గా అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ న‌రేంద్ర‌మోడీని గ‌ట్టిగా ఢీకొట్టిమాట్లాడేవారే క‌ర‌వ‌య్యారు. దీన్నే కేంద్ర ప్ర‌భుత్వం ఆస‌రాగా తీసుకొని ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను క‌ట్ట‌బెడుతోంది. దీనిపై ఏ ముఖ్య‌మంత్రీ ప్ర‌ధానిని నిల‌దీసే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ఒక్క దీదీయే ఎదురుతిర‌గ‌డం కేంద్రానికి కంట‌గింపుగా మారింది. ఎట్టిప‌రిస్థితుల్లోను బెంగాల్లో పాగావేసి మ‌మ‌త‌కు చెక్ పెట్టాల‌నే ప‌ట్టుద‌లతో మోడీ, అమిత్ షా ఉన్నారు.

స్పందించ‌మ‌ని ముఖ్య‌మంత్రులు
మ‌మ‌తా బెన‌ర్జీ తాను పోటీచేస్తున్న నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక ముగియ‌డంతో మిగ‌తా అంశాల‌పై దృష్టిసారించారు. నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు క‌లిసిరావాలంటూ బీజేపీయేత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు దీదీ లేఖ‌లు రాశారు. దీనిపై వారినుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోయిన‌ప్ప‌టికీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ముఖ్య‌మంత్రులు, ప్ర‌తిప‌క్ష నేత‌ల అవ‌స‌రాలు ఎవ‌రివి వారికే ఉన్నాయికాబ‌ట్టి ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌కుండా గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ వారంద‌రికీ మోడీని ఎదురించ‌డానికి, అవ‌స‌ర‌మైతే బీజేపీ ఓట‌మిపాలు కావ‌డానికి ఎవ‌రో ఒక‌రు కావాలి. అందుకే వారు కూడా దీదీవైపు చూస్తున్నారు. అన్నీ సిద్ధం చేసి మీరు తుపాకీ గురిపెట్టండి.. మేడం.. మేం వెంట‌నే ట్రిగ్గ‌ర్ నొక్కుతాం అంటున్నారేకానీ ధైర్యంగా ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. ఎవ‌రెవ‌రు క‌లిసివ‌స్తార‌నే అంశ‌మై దీదీ ఈ లేఖ‌లు రాసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై భ‌విష్య‌త్తు పోరాటానికి ఒక అంచ‌నాకు రావ‌చ్చ‌నేది దీదీ అంచ‌నా. చూద్దాం.. భ‌విష్య‌త్తులో ఎవ‌రు మ‌మ‌త‌కు మ‌ద్ద‌తుగా ముందుకొస్తారో!!!.



మ‌ళ్లీ ఖాళీ అవుతున్న న‌గ‌రం... హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా టు లెట్ బోర్డులే..

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>