ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sadly-all-the-money-stolen-by-the-thief-was-enough-for-his-treatment-ddb12d9a-1d5d-4885-8734-f3077bd98a99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sadly-all-the-money-stolen-by-the-thief-was-enough-for-his-treatment-ddb12d9a-1d5d-4885-8734-f3077bd98a99-415x250-IndiaHerald.jpgదొంగలు అన్నాక దొరికిన కాడికి దోచుకోవడం కామన్.కొంతమంది దొంగలు అయితే చాలా అంచనాలతో ఇంట్లో చొరబడి ఎక్కువ మొత్తం సొమ్ములని దోచుకుంటారు. ఇక వారు ఆ ఇంట్లో చాలా సొమ్ములుంటాయని భావిస్తారు. అక్కడ ఆశించిన మొత్తం దొరక్కపోతే నిరుత్సాహపడతారు. అయితే, ఈ దొంగ మాత్రం పెద్దగా అంచనాలేవీ లేకుండానే దొంగ తనానికి వెళ్లాడు. అక్కడ తాము ఆశించిన మొత్తం కంటే ఎక్కువ నగదు దొరకడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆనందం ఎక్కువ కావడంతో గుండె నొప్పితో ఆస్పత్రిపాలయ్యాడు. చివరికి ఆ దొంగిలించిన మొత్తాన్ని తన చికిత్సకే ఖర్చు చేయాల్సి వచViral;india;uttar pradesh;veer singhh;police;february;heart;thief;traffic police;donga;santoshamపాపం ఆ దొంగ దొంగిలించిన డబ్బు మొత్తం అతని చికిత్సకే సరిపోయింది....పాపం ఆ దొంగ దొంగిలించిన డబ్బు మొత్తం అతని చికిత్సకే సరిపోయింది....Viral;india;uttar pradesh;veer singhh;police;february;heart;thief;traffic police;donga;santoshamFri, 02 Apr 2021 23:00:00 GMTదొంగలు అన్నాక దొరికిన కాడికి దోచుకోవడం కామన్.కొంతమంది దొంగలు అయితే చాలా అంచనాలతో ఇంట్లో చొరబడి ఎక్కువ మొత్తం సొమ్ములని దోచుకుంటారు. ఇక వారు ఆ ఇంట్లో చాలా సొమ్ములుంటాయని భావిస్తారు. అక్కడ ఆశించిన మొత్తం దొరక్కపోతే నిరుత్సాహపడతారు. అయితే, ఈ దొంగ మాత్రం పెద్దగా అంచనాలేవీ లేకుండానే దొంగ తనానికి వెళ్లాడు. అక్కడ తాము ఆశించిన మొత్తం కంటే ఎక్కువ నగదు దొరకడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆనందం ఎక్కువ కావడంతో గుండె నొప్పితో ఆస్పత్రిపాలయ్యాడు. చివరికి ఆ దొంగిలించిన మొత్తాన్ని తన చికిత్సకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఫిబ్రవరి నెలలో జరిగిన ఓ చోరీ కేసులో పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మ్ వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 16 అర్ధరాత్రి ఇద్దరు దొంగలు నవాబ్ హైదర్ అనే వ్యక్తికి చెందిన పబ్లిక్ సర్వీస్ సెంటర్‌‌లోకి చొరబడ్డారు. సుమారు రూ.7 లక్షలు, మరికొన్ని విలువైన వస్తువులను దొంగిలించారు. హైదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఆ దొంగతనానికి ఒడిసిగట్టిన దుండగులు నౌషద్, అజాజ్‌గా గుర్తించడం జరిగింది.



మొదట పాపం వారు అక్కడ వేలల్లో మాత్రమే సొమ్ము ఉంటుందని అనుకున్నారట. అయితే, అక్కడ ఊహించిన దాని కంటే ఎక్కువ నగదు కనబడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.దొంగ తనం తర్వాత ఇద్దరు దొంగలు కూడా దొంగిలించిన ఆ సొమ్మును సమానంగా పంచుకోవడం జరిగింది.ఆ తర్వాత అజాజ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో అతడు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. ట్రీట్మెంట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. నౌషద్ మాత్రం ఆ డబ్బులను బెట్టింగులో పెట్టాడు. నిందితుల నుంచి పోలీసులు రూ.3.7 లక్షలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రూ.5 వేలు చొప్పున రివార్డు ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



పవన్ పరువు తీసిన తిరుపతి బీజేపీ అభ్యర్థి

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>