HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/oil-masage-on-foot-edcd539b-7a44-4ca3-8826-e5080570b7ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/oil-masage-on-foot-edcd539b-7a44-4ca3-8826-e5080570b7ab-415x250-IndiaHerald.jpgమన శరీరంలో ప్రతి భాగానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మనలో చాలామంది పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాదాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే పాదాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. అందుకే ఆయుర్వేద సాంప్రదాయంలో పాదాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. శరీరం అలాగే ఆత్మ ఒక వ్యక్తి పాదాలవద్ద కలుస్తాయి అనేది పురాతన నమ్మకం. కాబట్టి ఆ కాలం లోనే పాదాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.. OIL MASAGE ON FOOT;oil;ayurvedaరాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?OIL MASAGE ON FOOT;oil;ayurvedaFri, 02 Apr 2021 15:20:00 GMT
మన శరీరంలో ప్రతి భాగానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మనలో చాలామంది పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పాదాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే పాదాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. అందుకే ఆయుర్వేద సాంప్రదాయంలో పాదాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. శరీరం అలాగే ఆత్మ ఒక వ్యక్తి పాదాలవద్ద కలుస్తాయి అనేది పురాతన నమ్మకం. కాబట్టి ఆ కాలం లోనే పాదాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు..

అయితే పాదాలను ఆరోగ్యవంతంగా ఉంచాలి అంటే, పాదాలకు అవసరమైన సంరక్షణ అందించడంలో పాదాల రాపిడి ప్రక్రియ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయుర్వేదం నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల నాడీ ఉద్రిక్తతను తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది..

అయితే పాదాలకు ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. సాధారణంగా మన శరీరంలోని వివిధ అవయవాల నాడీ చివరలు పాదాలలో ముగుస్తాయి. కాబట్టి పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఆ నరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే రిఫ్రెష్ అయ్యి  నరాలు బలపడతాయి. ఇది శరీరం మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అవయవాలను బలపరుస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయుర్వేద తైలంతో  మసాజ్ చేయడం వంటి మంచి పద్ధతి ని అలవాటు చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల నిద్ర సుఖం గా వస్తుంది. అలాగే రక్తప్రవాహాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని ప్రేరేపించి, ఆటోఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.  వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది. పాదాలపై దద్దుర్లు రాకుండా నివారిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా  ఉండేలా చేస్తుంది. పాదాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఈ చికిత్స ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిని ఒకసారి అనుసరించండి. ఈ చికిత్స వల్ల కలిగే లాభాలను పొంది, ఎన్నో రకాలైన వ్యాధుల నుంచి విముక్తి పొందండి..





మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>