PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/america94b7ecd1-c257-4a0d-b571-fa41ff4b9a9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/america94b7ecd1-c257-4a0d-b571-fa41ff4b9a9f-415x250-IndiaHerald.jpg అమెరికా.. అంటే ఓ సంపన్న రాజ్యం.. అమెరికా అంటే..ఓ స్వప్నలోకం.. అమెరికా అంటే చాలామందికి డాలర్‌ డ్రీమ్స్.. కానీ.. అమెరికాకు చెందిన ఓ షాకింగ్ న్యూస్.. ఇటీవల బయటకు వచ్చింది. అదేంటంటే.. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఈ విషయాన్ని ఆ దేశ కార్మిక శాఖే వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారట. దీనివల్ల గతవారం 6.84 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం 7.19 లక్షలకు చేరాయట. కరోనా తర్వాత మళ్లీ వ్యాపారాలు పునఃప్రారంభమamerica;american samoa;application;partyవార్నీ.. అమెరికా పరిస్థితి మరీ ఇంత వరస్టుగా తయారయ్యిందా..?వార్నీ.. అమెరికా పరిస్థితి మరీ ఇంత వరస్టుగా తయారయ్యిందా..?america;american samoa;application;partyFri, 02 Apr 2021 10:00:00 GMT
అమెరికా.. అంటే ఓ సంపన్న రాజ్యం.. అమెరికా అంటే..ఓ స్వప్నలోకం.. అమెరికా అంటే చాలామందికి డాలర్‌ డ్రీమ్స్.. కానీ.. అమెరికాకు చెందిన ఓ షాకింగ్ న్యూస్.. ఇటీవల బయటకు వచ్చింది. అదేంటంటే.. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందట.  ఈ విషయాన్ని ఆ దేశ కార్మిక శాఖే వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారట.


దీనివల్ల గతవారం 6.84 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం 7.19 లక్షలకు చేరాయట. కరోనా  తర్వాత మళ్లీ  వ్యాపారాలు పునఃప్రారంభమైనా  ఇప్పటికీ చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయట. కరోనా ప్రారంభానికి ముందు 2.20 లక్షలు మంది మాత్రమే నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదు చేసుకున్నారట. కానీ ఇప్పుడు అది నాలుగు రెట్లు పెరిగిందట. అయితే.. అమెరికాలో చురుగ్గా సాగుతున్న టీకా పంపిణీ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని భావిస్తున్నారు.


అయితే అమెరికా కు సంబంధించిన  ఇలాంటి న్యూస్ కొత్తేమీ కాదు.. ఇటీవలే అమెరికాకు కూడా చాలా అప్పులు ఉన్నట్టు ఓ నివేదిక తెలిపింది. అమెరికా అప్పుల విషయాన్ని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ ఒకరు వెల్లడించారు. అమెరికాకు అప్పులిచ్చిన దేశాల్లో చైనా, జపాన్‌లతో పాటు భారత్‌ వంటి ఇతర దేశాలూ ఉన్నాయట. అమెరికా ఒక్క భారత దేశానికి తీర్చాల్సిన రుణమే 21,600 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.15.89 లక్షల కోట్లు ఉందని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే తెలిపారు.


ఇక ప్రపంచంలోని వివిధ దేశాలకు అమెరికా తీర్చాల్సిన అప్పు మొత్తం లెక్కలు చూస్తే 29 లక్షల కోట్ల డాలర్లట. అంటే.. సుమారు రూ.2134 లక్షల కోట్లు అన్నమాట. మరి ఈ అప్పు అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.. దీనిలో సింహభాగం చైనా, జపాన్‌లకు చెల్లించాల్సిందే ఉందట. రుణభారం భారీగా ఉందని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ అలెక్స్‌ మూనే ఇటీవల అమెరికా ప్రతినిధుల సభలో గగ్గోలు పెట్టారు.



కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>