MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nirupamb892b51c-18da-47cd-beca-4eee95f5cf74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nirupamb892b51c-18da-47cd-beca-4eee95f5cf74-415x250-IndiaHerald.jpgబుల్లితెర శోభన్ బాబుగా మంచి గుర్తింపు నటుడు నిరుప‌మ్. ఆయన కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దీంతో ‘కార్తీక దీపం’ టీం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.nirupam;cbn;karthik;deepa;prema;sobhan babu;love;doctor;star maa;shoban babuడాక్టర్ బాబుకి బెదురింపు కాల్స్.. ఎందుకో తెలుసా..!డాక్టర్ బాబుకి బెదురింపు కాల్స్.. ఎందుకో తెలుసా..!nirupam;cbn;karthik;deepa;prema;sobhan babu;love;doctor;star maa;shoban babuFri, 02 Apr 2021 08:00:00 GMTడాక్టర్ బాబు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దీంతో ‘కార్తీక దీపం’ టీం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సీరియల్ ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది.

ఇక సోషల్ మీడియాలో వీరి పాత్రల పై బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుండడం.. అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇదిలా ఉండగా.. ఈ సీరియల్ లో నా పాత్ర నాకే నచ్చడం లేదంటూ తాజాగా డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ చేసిన కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. నిరుపమ్ మాట్లాడుతూ.. “కార్తీక్ పాత్ర‌లో న‌టించడం నాకు ఎప్పుడూ బోర్ కొట్ట‌లేదు. దీప‌ను అనుమానించ‌డం మొద‌లు పిల్ల‌ల‌పై ప్రేమ… ఇలా ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి.

అయితే నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసింది ఈ పాత్ర. బుల్లితెర ‌పై అలాంటి అవకాశం అందరికీ దొరకదు. అయితే ఒక సామాన్య ప్రేక్ష‌కుడిగా అయితే కార్తీక్ పాత్ర నాకు నచ్చడం లేదు. సీరియల్ ప్రారంభం నుండీ ఆధారం లేని ఆరోప‌ణ‌ల‌ను నమ్మేసి దీప‌ను అనుమానించ‌డం, ఆమెను కించ‌ప‌రచ‌డం నన్ను కూడా బాధ పెట్టాయి. కానీ సీరియ‌ల్ కథ ప్రకారం త‌ప్ప‌డం లేదు. దీప‌ను బాధ పెట్టడం గురించి బ‌య‌ట చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు.

అంతేకాదు.. దీపకి ఎప్పుడు న్యాయం చేస్తావ‌ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవి నాకు అలవాటు అయిపోయాయి. అంతేకాదు నాకు బెదిరింపు మెసేజ్‌లు, ఫోన్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్ట‌ర్‌ కి, స్టార్ మా యాజ‌మాన్యానికి అవి చూపించగా నా పాత్ర‌లో కొన్ని కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.


ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>