PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-banerjee-descending-on-varanasi-from-moda7e2afa5-df47-4c61-9fed-29989cfe84e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-banerjee-descending-on-varanasi-from-moda7e2afa5-df47-4c61-9fed-29989cfe84e5-415x250-IndiaHerald.jpgఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎవ‌రెవ‌రు పోటీచేస్తున్నార‌నే విష‌య‌మై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు మూడేళ్లు స‌మ‌య‌మున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే ఎందుకు అన్న సందేహం రావ‌చ్చు. కానీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన న‌రేంద్ర‌మోడీ, మ‌మ‌తా బెన‌ర్జీ హోరాహోరీగా ఎలా త‌ల‌ప‌డుతున్నారో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌నం చూస్తున్నాం. కొన్ని సంవ‌త్స‌రాలుగా వారిద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న యుద్ధం బెంగాల్ ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌తాక‌స్థాయికి చేరింది.mamatha, modi, bjp, varanasi, latest news;modi;mamata benerjee;benarjee;varanasi;west bengal - kolkata;narendra modi;congress;prime minister;loksabha;nijam;mamta mohandas;party;narendraమోడీపై వార‌ణాసి నుంచి బ‌రిలోకి దిగుతున్న మ‌మ‌తాబెన‌ర్జీ??మోడీపై వార‌ణాసి నుంచి బ‌రిలోకి దిగుతున్న మ‌మ‌తాబెన‌ర్జీ??mamatha, modi, bjp, varanasi, latest news;modi;mamata benerjee;benarjee;varanasi;west bengal - kolkata;narendra modi;congress;prime minister;loksabha;nijam;mamta mohandas;party;narendraFri, 02 Apr 2021 17:15:55 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎవ‌రెవ‌రు పోటీచేస్తున్నార‌నే విష‌య‌మై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు మూడేళ్లు స‌మ‌య‌మున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే ఎందుకు అన్న సందేహం రావ‌చ్చు. కానీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన న‌రేంద్ర‌మోడీ, మ‌మ‌తా బెన‌ర్జీ హోరాహోరీగా ఎలా త‌ల‌ప‌డుతున్నారో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌నం చూస్తున్నాం. కొన్ని సంవ‌త్స‌రాలుగా వారిద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న యుద్ధం బెంగాల్ ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌తాక‌స్థాయికి చేరింది. కానీ అంత‌టితో ఆగ‌కుండా 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి ఇద్ద‌రిమ‌ధ్యా చావో? రేవో? తేల్చుకునే ప‌రిస్థితి ఎదుర‌వ‌బోతోంది.

మోడీకి దీదీ స‌వాల్‌
2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై దీదీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారా? ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీతో సై అంటే సై అంటున్న దీదీ నిజంగానే వారణాసి బరిలోకి దిగ‌నున్నారా? అన్న చర్చ ఇప్పుడే ప్రారంభ‌మైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బ‌రిలో ఉన్న మ‌మ‌త ఓట‌మిపాల‌వ‌డం ఖాయమని, ఆమె మరో నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. మోడీ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ వేసింది.

మీరే ఇంకో సీటు చూసుకోండి
దీదీ మ‌మ‌త కచ్చితంగా నందిగ్రామ్ నుంచి గెల‌వ‌బోతున్నారు.. అందులో సందేహం లేదు.. ఆమె మరో స్థానం నుంచి పోటీ చేసే ప్ర‌స‌క్తే లేదు.. ప్రజలు మీ అబద్ధాలను గుర్తిస్తారు.. వారిని తప్పుదోవ పట్టించే అల‌వాటు మానుకోండి.. . మీరే 2024లో మరో సీటు చూసుకోండి.. ఎందుకంటే మీకు వారణాసిలో అసలు సిసలు సవాలు ఎదురు కాబోతోంది అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. మరి వారణాసిలో మోదీకి సవాలు విసరబోయేది ఎవ‌రు?  దీదీయేనా? అన్న చర్చ దేశ‌వ్యాప్తంగా మొదలైంది. మోదీకి వారణాసిలో కచ్చితంగా సవాలు ఎదురు కాబోతోందని, అయితే ఆయనపై మమత పోటీ చేస్తుందా? లేదా? అన్న నిర్ణయం పార్టీ తీసుకుంటుందని టీఎంసీ అధికార ప్రతినిధి తపస్ రాయ్ అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను చూస్తే మ‌మతా బెన‌ర్జీ ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు కూడా రాశారు. మోడీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాల‌ని, మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని కోరారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న ఈ యుద్ధానికి విరామం లేద‌ని, అది వార‌ణాసికి చేర‌డంద్వారా మ‌రో రూపు సంత‌రించుకుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
=================






కేంద్రాన్ని పొగుడుతూనే పంచ్‌లేసిన మంత్రి ఎర్ర‌బెల్లి...

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>