EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tirupati-bypoll-tirupati-by-elections-parishat-elections52311916-3a08-4e5f-bd03-baf58cb971d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tirupati-bypoll-tirupati-by-elections-parishat-elections52311916-3a08-4e5f-bd03-baf58cb971d4-415x250-IndiaHerald.jpgఈనెల 8న పరిషత్ ఎన్నికలు, 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలంటూ ఎస్ఈసీ నీలం సాహ్ని షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఆగిపోయిందో, అక్కడినుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అయితే అదే సందర్భంలో అటు తిరుపతి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 17న జరుగుతుంది. మే 2న ఫలితాలుంటాయి. అంటే తిరుపతి ఉప ఎన్నికలకంటే ముందే పరిషత్ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఆల్రడీ ఏకగ్రీవాల్లో పైచేయి సాధించి, పంచాయతీ, మున్సిపాల్టీలో క్లీన్ విక్టరీ సాధించిన వైసీపీ పరిషత్ tirupati bypoll, tirupati by elections, parishat elections;venkatesh;mano;tiru;janasena;tirupati;panchayati;husband;tdp;ycp;janasena party;nijam;partyతిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?tirupati bypoll, tirupati by elections, parishat elections;venkatesh;mano;tiru;janasena;tirupati;panchayati;husband;tdp;ycp;janasena party;nijam;partyFri, 02 Apr 2021 07:00:00 GMTఈనెల 8న పరిషత్ ఎన్నికలు, 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలంటూ ఎస్ఈసీ నీలం సాహ్ని షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ ఆగిపోయిందో, అక్కడినుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అయితే అదే సందర్భంలో అటు తిరుపతి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 17న జరుగుతుంది. మే 2న ఫలితాలుంటాయి. అంటే తిరుపతి ఉప ఎన్నికలకంటే ముందే పరిషత్ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఆల్రడీ ఏకగ్రీవాల్లో పైచేయి సాధించి, పంచాయతీ, మున్సిపాల్టీలో క్లీన్ విక్టరీ సాధించిన వైసీపీ పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందనే నమ్మకం అందరిలో ఉంది.

అధికార దుర్వినియోగం, వాలంటీర్ల పక్షపాతం అంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వైసీపీ విక్టరీ మాత్రం స్పష్టం. ఈ దశలో అసలు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాలకు పరువు దక్కుతుందా అనేది అనుమానమే. అందులోనూ తిరుపతి ఉప ఎన్నికల ముందుగా వచ్చే ఈ ఫలితాలు కార్యకర్తల మనో ధైర్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందుకే ఈ ఎన్నికలకు టీడీపీ, జనసేన దూరంగా ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తోందనే ప్రచారం మొదలైంది. అయితే టీడీపీ తరపున అలాంటి అధికారిక ప్రకటనేదీ విడుదల కాకపోవడం విశేషం. మరోవైపు జనసేన మాత్రం ఎస్ఈసీ నిర్వహించే అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జనసేనకు కూడా ఇష్టం లేదనమాట.

ఓటమి భయంతోనేనా..?
ఏపీలో మొత్తం మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా గతేడాది.. వీటిలో 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లు స్వీకరించారు. 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 526  స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగాను, 2,371 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 7,322 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ స్థాయిలో ఏకగ్రీవాలను సాధించిన వైసీపీ.. పోలింగ్ జరిగినా మిగతా వాటిని చేజిక్కించుకుంటుందనే నమ్మకం అధికార పార్టీతోపాటు, ప్రతిపక్షాల్లో కూడా ఉంది. అందులోనూ తిరుపతి ఉప ఎన్నికల ముందుగా జరిగే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ సర్వ శక్తులూ ఒడ్డుతుంది. ఒకవేళ నిజంగా తమ తరపున అభ్యర్థులు గెలిచినా.. పార్టీ ఫిరాయించకుండా ఉంటారనే గ్యారెంటీ కూడా లేదు. అందుకే పరిషత్ ఎన్నికల్ని టీడీపీ, జనసేన లైట్ తీసుకుంటున్నాయి. పోటీ చేసి ఓడిపోవడం కంటే ముందుగానే.. మేం ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామంటూ కవర్ చేస్తున్నాయి.



ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యే దెబ్బకు టీడీపీ కనుమరుగైపోతుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>