PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amarnath-yatra-20219329ea7d-f763-4a61-a1d3-062cfb241ccf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amarnath-yatra-20219329ea7d-f763-4a61-a1d3-062cfb241ccf-415x250-IndiaHerald.jpgఅమర్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటున్నారా.. మంచుకొండల్లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించాలనుకుంటున్నారా.. మీకు శుభవార్త.. జమ్మూకశ్మీర్‌ లోని అమర్‌నాథ్‌ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమవుతున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ యాత్ర దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూన్‌ 28 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ యాత్ర ఈ ఏడాది 56 రోజులపాటు సాగనుంది. ఈ యాత్ర చేయాలంటే అమర్‌నాథ్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. 13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడamarnath-yatra-2021;amala akkineni;amar;krishna river;himayath sagar;andhra pradesh;rbi;kadapa;vishakapatnam;huzur nagar;job;sangareddy;march;karimnagar;punjab;yatraఅమర్‌నాథ్‌ యాత్ర చేయాలనుందా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి....!అమర్‌నాథ్‌ యాత్ర చేయాలనుందా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి....!amarnath-yatra-2021;amala akkineni;amar;krishna river;himayath sagar;andhra pradesh;rbi;kadapa;vishakapatnam;huzur nagar;job;sangareddy;march;karimnagar;punjab;yatraFri, 02 Apr 2021 07:00:00 GMTఅమర్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటున్నారా.. మంచుకొండల్లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించాలనుకుంటున్నారా.. మీకు శుభవార్త.. జమ్మూకశ్మీర్‌ లోని అమర్‌నాథ్‌ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమవుతున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ యాత్ర దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూన్‌ 28 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ యాత్ర ఈ ఏడాది 56 రోజులపాటు సాగనుంది.

యాత్ర చేయాలంటే అమర్‌నాథ్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. 13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వారికి యాత్రకు అనుమతి ఇవ్వరు. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రకు  6లక్షల మంది రావొచ్చని ఒక అంచనా ఉంది. రెండేళ్ల తర్వాత యాత్ర జరుగుతుండటంతో ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏడు లక్షల మంది వెళ్తుంటారు.

కరోనా కారణంగా 2020లో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేశారు. ఈ ఏడాది యాత్రను ప్రారంభించేందుకు దేవస్థానం బోర్డు సిద్ధమైంది. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ లో కరోనా కారణంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా 446 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ శాఖల్లో యాత్ర రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.  ఈ బ్యాంకు శాఖల వివరాలు www.shriamarnathjishrine.com అందుబాటులో ఉన్నాయి. అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో ఆరు బ్యాంకులు, ఏపీలో ఆరు బ్యాంకులలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కరీంనగర్, సంగారెడ్డి, సిద్ధిపేట, సికింద్రాబాద్ లో హిమాయత్ సాగర్ లో గత పీఎన్‌బీ బ్యాంకులతోపాటు జమ్మూకాశ్మీర్‌ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఏపీ విషయానికి వస్తే.. కృష్ణా, గుంటూరు చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్నంలోని పంజాబ్ నేషనల్‌ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కల్పించారు. అయితే..  మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుతాయి. ఈ సారి అమర్‌నాథ్ యాత్ర బాల్తాల్‌, చందన్వారీ ప్రారంభం అవుతుంది.





ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>