MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/pawan-kalyanb608535e-f0fc-4921-b596-765dd7dfb52e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/pawan-kalyanb608535e-f0fc-4921-b596-765dd7dfb52e-415x250-IndiaHerald.jpgప్రతిభావంతులైన యువ న‌టీన‌టుల‌కు, ర‌చయిత‌ల‌కు , టెక్నీషియ‌న్ ల‌కు గుడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ మ‌రియు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణ‌యించ‌కున్నాయి. కోట్లాదిమంది అభిమానులను మెప్పించే పవన్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ నవ్యరీతి చిత్రాలను, సృజనాత్మక కథలను ఇష్టపడతారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను... బహు భాషల్లో మన కథలను తీసుకpawan kalyan;pawan;pawan kalyan;vedhika;industries;cinema;media;producer;population;good news;producer1;yuva;good newwzప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాన‌ర్ లో 15 సినిమాలు..వారికి గుడ్ న్యూస్..!ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాన‌ర్ లో 15 సినిమాలు..వారికి గుడ్ న్యూస్..!pawan kalyan;pawan;pawan kalyan;vedhika;industries;cinema;media;producer;population;good news;producer1;yuva;good newwzFri, 02 Apr 2021 10:59:21 GMTప్రతిభావంతులైన యువ న‌టీన‌టుల‌కు, ర‌చయిత‌ల‌కు , టెక్నీషియ‌న్ ల‌కు గుడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ మ‌రియు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణ‌యించ‌కున్నాయి. కోట్లాదిమంది అభిమానులను మెప్పించే పవన్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడూ నవ్యరీతి చిత్రాలను, సృజనాత్మక కథలను ఇష్టపడతారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను... బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. ద్వారా విస్తృతంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పరిశ్రమ పంథాలో.. ప్రణాళికాబద్ధంగా సాగించాలనే ఆలోచనతో  ఈ సంస్థ ద్వారా వేగంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక పరిశ్రమగా మ‌రోసారి నిరూపించేందుకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. సంస్థల భాగస్వామ్యం ఉండబోతుంది. అంతే కాకుండా పలు కొత్త త‌రహా ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా 6 చిన్న సినిమాలు..6 మ‌ధ్య త‌ర‌హా సినిమాలు..మ‌రో 6 భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించబోతున్నారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్  మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం వల్ల యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు... కలలు కార్యరూపం దాల్చే వేదిక రూపుదిద్దుకుంటుంది. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది. అంతే కాకుండా ఈ సినిమాల‌కు శ్రీ హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతల్లో ఉంటారు. దీనిపై సంస్థ ప్రతినిధులు త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.





టాలీవుడ్ గాసిప్స్ : అదే 100వ సినిమా అంటున్న నాగర్జున..!

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>